TSPSC లో పోస్టులకు ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇలా..


తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇటీవల వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా.. 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 16 నుంచి అంటే నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. డిగ్రీలో ఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. లేదా డిగ్రీలో ఫార్మాస్యూటికల్ సైన్స్ లేదా డీ. ఫార్మా లేదా క్లినికల్ ఫార్మకాలజీ స్పెషలైజేషన్ లో మెడిసిన్ లేదా మైక్రోబయాలజీలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అయితే ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.




దరఖాస్తు విధానం ఇలా..

-మొదట అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దీని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తర్వాత డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ అప్లికేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.


-తర్వాత ఓపెన్ అయిన పేజీలో టీఎస్పీఎస్సీ ఐడీని ఎంటర్ చేయాలి. దీంతో పాటు.. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.

-తదుపరి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది.

-దీనికి ఎంటర్ చేయగానే.. అప్లికేషన్ పేజీలోకి వెళ్తుంది. ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలను సరి చూసుకోవాలి. తర్వాత అర్హతకు సంబంధించి పూర్తి వివరాలను ఎంటర్ చేసి.. సబ్ మిట్ బటన్ క్లిక్ చేయాలి.

-తర్వాత అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని.. ప్రింట్ తీసుకోవాలి. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.