సిపాయీల తిరుగుబాటు వీరుడు తుర్రేబాజ్ ఖాన్.. కోఠిలో స్మారకం ఉందన్న విషయం తెలుసా?
హైదరాబాద్ నగరంలో సిపాయీల తిరుగుబాటు అనగానే వెంటనే గుర్తుకువచ్చే పేరు తుర్రెేబాజ్ ఖాన్. 500 మంది రోహిల్లాలతో కలిసి హైదరాబాద్‌లో బ్రిటిష్ రెసిడెంట్ మేజర్ డేవిడ్‌సన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశాడు.
కోఠిలో బ్రిటిష్ రెసిడెన్సీలో బందీగా ఉన్న జమేదార్ చీదాఖాన్‌ను విడిపించుకునేందుకు తిరుగుబాటు జరిగింది.
తుర్రెేబాజ్ ఖాన్ నాయకత్వంలో రోహిల్లాలు రెసిడెన్సీ మీద దాడి నిర్వహించారు. దాడులకు అబ్బాన్ సాహెబ్, జయగోపాల్ దాస్ అనే వ్యాపారుల ఇళ్లను ఆశ్రయంగా చేసుకున్నారు. అప్పుడు హైదరాబాద్ ప్రధానిగా ఉన్న సాలార్‌జంగ్ తిరుగుబాటు గురించి రెసిడెంట్ డేవిడ్‌సన్‌కు ఉప్పందించడంతో బ్రిటిష్ సైన్యాలు సంసిద్ధంగా ఉన్నాయి
ఈ క్రమంలోనే మేజర్ ఎస్‌సీ బ్రిగ్స్ నాయకత్వంలో బ్రిటిష్ సైన్యాలు రోహిల్లాల మీద దాడులు జరిపాడు. కేవలం ఒక్క రాత్రిలోనే తిరుగుబాటును అణచివేశాడు. తుర్రెేబాజ్ ఖాన్ సహా తిరుగుబాటులో పాల్గొన్నవారిని పట్టుకొని జీవిత ఖైదు విధించారు.
అయితే, ఖాన్ 1859 జనవరి 8న కారాగారం నుంచి తప్పించుకున్నాడు. తూప్రాన్ తాలూకాదార్ మీర్జా ఖుర్బాన్ అలీ బేగ్ నమ్మక ద్రోహం చేయడంతో జనవరి 24న తూప్రాన్ దగ్గర తురేబాజ్ ఖాన్‌ను చంపేశారని తెలుస్తున్నది. అనంతరం తుర్రెేబాజ్ ఖాన్ పార్థివదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చి రెసిడెన్సీ దగ్గర వేలాడదీసినట్లు చారిత్రక రికార్డులు చెబుతున్నాయి. తుర్రెేబాజ్ ఖాన్ వీర మరణానికి చిహ్నంగా ఇప్పటి కోఠి బస్ స్టేషన్ ముందు ఉన్న స్మారక చిహ్నన్ని నిర్మించారు.
మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి లోగో పై క్లిక్ చేయండి
Comments
Post a Comment