Central Government Jobs: డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్.. రూ.56,100 జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు.

ఇండియన్‌ కోస్ట్‌ గార్డు అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులకు అర్హులైన పురుష, మహిళ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 71 పోస్టుల vccను భర్తీ చేయనున్నారు.


విభాగాల వారీగా పోస్టులు ఇలా ఉన్నాయి.

 జనరల్‌ డ్యూటీ (జీడీ) పోస్టులు 40

కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్‌ (ఎస్‌ఎస్‌ఏ) 10

టెక్నికల్‌ (మెకానికల్‌) 06

టెక్నికల్‌ (ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌) 14

లా ఎంట్రీ పోస్టులు 01 ఉన్నాయి


విభాగాన్ని అనుసరించి పన్నెండో తరగతి, డిగ్రీ, డిగ్రీ(ఇంజినీరింగ్‌/ లా) పూర్తి చేసి ఉండాలి. కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్‌ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.


జీడీ, టెక్నికల్‌ పోస్టులకు జూలై 01, 1998 నుంచి జూన్ 30, 2002 మధ్య జన్మించి ఉండాలి. 

కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్‌కు 01.07.1998 నుంచి 30.06.2004 మధ్య; లా ఎంట్రీకి 01.07.1994 నుంచి 30.06.2002 మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి


ఈ పోస్టులు మొత్తం 5 స్టేజ్ లలో పూర్తి చేస్తారు. ధ్రువపత్రాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,100 చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 250 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు


ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 09, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://joinindiancoastguard.cdac.in/ ను సందర్శించండి


Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్