CISF Recruitment : పదో తరగతి అర్హతతో కేంద్ర రక్షణ దళంలో 451 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..

 కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్స్‌.. 451 కానిస్టేబుల్‌ (డ్రైవర్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఫైర్‌ సర్వీస్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 


ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు హెవీ మోటార్ వెహికల్ లేదా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లేదా లైట్ మోటార్ వెహికల్ లేదా మోటార్ సైకిల్ విత్ గేర్‌ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. అలాగే మూడేళ్ల డ్రైవింగ్‌ అనుభవం కూడా ఉండాలి. ఎత్తు 167 సెంటీ మీటర్లు, ఛాతీ కొలత 80 నుంచి 85 సెంటీ మీటర్లు ఉండాలి. అభ్యర్ధుల వయసు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఫిబ్రవరి 22, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. 

ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు ఫీజు చెల్లించనవసరం లేదు. ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. 

ఎంపిక ప్రక్రియ
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ వంటి మల్టి-లెవల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం లభిస్తుంది. , 2004 జనవరి 1న లేదా ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో చేరిన ఉద్యోగులందరికీ వర్తించే “నేషనల్ పెన్షన్ సిస్టమ్‌‌గా పేర్కొనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ పెన్షనరీ ప్రయోజనాలు అందుతాయి.

ఖాళీల వివరాలు..

కానిస్టేబుల్/డ్రైవర్ పోస్టులు: 183

కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ (ఫైర్‌ సర్వీస్‌) పోస్టులు: 268


దరఖాస్తు విధానం
- ముందుగా సీఐఎస్‌ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ cisfrectt.inను సందర్శించాలి.
-హోమ్‌పేజీలో లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆపై కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్-2022 లింక్‌పై క్లిక్‌ చేయాలి.
- అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్, టెక్స్‌ట్ ఇమేజ్‌ను ఎంటర్ చేయాలి. అవసరమైన అన్ని వివరాలతో అప్లికేషన్‌ను పూర్తి చేసి, తర్వాత పేమెంట్ చేయాలి.
UR, OBC, EWS కేటగిరి అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), మాజీ సైనికుల (ESM) కేటగిరికి చెందిన అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. చివరగా అప్లికేషన్ సాప్ట్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవాలి.

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్