ESIC Hyderabad Recruitment - హైదరాబాద్‌ ఈఎస్‌ఐసీలో 106 ఖాళీలు , జీతం రూ.2,22,543 వరకు


హైదరాబాద్‌ ఈఎస్‌ఐసీలో 106 ఖాళీలు, పోస్టుల వివరాలు ఇలా!


హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూ‌రెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 106 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషలిస్ట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు జనవరి 9 నుంచి 16 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. వీరు జనవరి 20 నుంచి 31 వరకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. విభాగాలవారీగా ఇంటర్వ్యూ షెడ్యూలును నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంచారు. 

వివరాలు...

మొత్తం ఖాళీలు: 106

1) ప్రొఫెసర్

2) అసిస్టెంట్ ప్రొఫెసర్

3) అసోసియేట్ ప్రొఫెసర్

4) సీనియర్ రెసిడెంట్

5) జూనియర్ రెసిడెంట్

6) సూపర్ స్పెషలిస్ట్

విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, ఆంకాలజీ (సర్జికల్), జనరల్ మెడిసిన్, రేడియోడయాగ్నసిస్, ఆప్తాల్మాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఎమర్జన్సీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫిజికల్ మెడిసిన్ & రిహాబిలిటేషన్, అబ్‌స్టేట్రిక్స్ & గైనకాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, నియోనటాలజీ, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, అనస్థీషియా, మైక్రోబయాలజీ, సైకియాట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, ట్రాన్స్‌ఫ్యూజియన్ మెడిసిన్, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, డెంటిస్ట్రీ.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీడీఎస్ డిగ్రీ/ ఎంబీబీఎస్/ పీజీ డిగ్రీ/ డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 30-67 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500 చెల్లించాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

జీతభత్యాలు:  నెలకు రూ.1,05,356-రూ.2,22,543 చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు...

➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.01.2023 నుంచి.

➥ దరఖాస్తు చివరి తేది: 16.01.2023.

➥ ఇంటర్వ్యూ ప్రారంభం: 20.01.2023-31.01.2023.


🔖 నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి Notification

ఆన్లైన్ లో అప్లై కోసం  Online Application

వెబ్సైటు కోసం  Website 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.