Group 2 Exam Syllabus Changes: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, సిలబస్‌లో ఈ మార్పులు

 ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు అదనంగా పలు అంశాలను జత చేసింది.పేపర్‌-1, 4లో మార్పులేవీ చేయలేదు. పేపర్‌-2 రెండో సెక్షన్‌ పాలిటీలో కొత్తగా రాజ్యాంగ సవరణ విధానం, సవరణ చట్టాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు..



టీఎస్‌పీఎస్సీ 783 పోస్టులతో ఇటీవల విడుదల చేసిన గ్రూప్‌-2 ఉద్యోగాల సిలబస్‌లో కొన్ని మార్పులు చేసింది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టు అదనంగా పలు అంశాలను జత చేసింది. గ్రూప్‌-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా, 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పేపర్‌-2లో స్వల్ప మార్పులు చేయగా, పేపర్‌-3లో ఎక్కువ మార్పులు జరిగాయి. పేపర్‌-1, 4లో మార్పులేవీ చేయలేదు. పేపర్‌-2 రెండో సెక్షన్‌లోని పాలిటీలో కొత్తగా రాజ్యాంగ సవరణ విధానం, సవరణ చట్టాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు.

జాతీయ సమగ్రత, అంతర్గత భద్రత, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలు చేర్చారు. మూడో సెక్షన్‌లో భారతీయ సాంఘిక నిర్మాణంలో ఎథ్నిసిటీ, మతం-మహిళలు అనే అంశాన్ని చేర్చారు. పేపర్‌-3లోని ఒకటో సెక్షన్‌లో డెమోగ్రఫీ (జనాభా శాస్త్రం), ప్రాథమిక, ద్వితీయ రంగాలు, పరిశ్రమలు, సేవారంగం, ప్లానింగ్‌, నీతిఆయోగ్‌-పబ్లిక్‌ ఫైనాన్స్‌ జతచేశారు. రెండో సెక్షన్‌లో తెలంగాణ ఎకానమీ నిర్మాణం, వృద్ధితోపాటు జనాభా-మానవవనరుల అభివృద్ధి, వ్యవసాయం-అనుబంధ రంగాలు, పరిశ్రమలు-సేవా రంగాలు, రాష్ట్ర ఫైనాన్స్‌, బడ్జెట్‌, పాలసీలు చేర్చారు. మూడో సెక్షన్‌లో అభివృద్ధి-అండర్‌ డెవలప్‌మెంట్‌, పేదరికం-నిరుద్యోగిత, పర్యావరణం- సుస్థిర అభివృద్ధిని కొత్తగా కలిపారు.


గ్రూప్-2 పరీక్ష విధానం: 
మొత్తం 600 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు చొప్పున నాలుగు పేపర్లకు కలిపి 600 ప్రశ్నలకు 600 మార్కులు ఉంటాయి.


➥ పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. 

 పేపర్-2 (హిస్టరీ, పాలిటీ & సొసైటీ): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-3 (ఎకానమీ & డెవలప్‌మెంట్): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.

 పేపర్-4 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతారణ): 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి.  


ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.01.2023 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.02.2023

➥ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది.



నోటిఫికేషన్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

https://drive.google.com/file/d/1vdywHCbuZg6LyOuWa5pmAQdMttrCGQwU/view

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.