Indian Navy B.Tech Course: నేవీలో ఉచితంగా 'ఇంజినీరింగ్' విద్య, ఆపై ఉన్నత‌ హోదా ఉద్యోగం!

ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారికి 2023 జులైలో శిక్షణ ప్రారంభమవుతుంది




ఎంపికైన వారికి 2023 జులైలో శిక్షణ ప్రారంభమవుతుంది. వీరు ఎజిమల నేవల్ అకాడమీ(కేరళ)లో నాలుగేళ్ల ఇంజినీరింగ్ (బీటెక్) డిగ్రీ పూర్తిచేయాల్సి ఉంటుంది. అనంత‌రం నేవీలోనే ఉన్నత‌ హోదాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. జనవరి 28 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

వివరాలు..

* 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీం (పీసీ) - జులై 2023

మొత్తం ఖాళీల సంఖ్య: 35


1) ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్: 30 పోస్టులు.


2) ఎడ్యుకేషన్: 05 పోస్టులు


అర్హత‌లు: 70 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ (ఎంపీసీ) ఉత్తీర్ణులై ఉండాలి. ప‌దోత‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ ఇంగ్లిష్‌లో క‌నీసం 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి. జేఈఈ మెయిన్-2022లో అర్హత సాధించిన‌వారై ఉండాలి. నిర్దిష్ట శారీర‌క, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 02.01.2004 నుంచి 01.07.2006 మధ్య జన్మించి ఉండాలి.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: జేఈఈ ర్యాంకు, వివిధ ర‌కాల‌ ప‌రీక్షలు, గ్రూప్ డిస్కష‌న్, ఇంట‌ర్వ్యూలు, ఫిజిక‌ల్ టెస్టు, వైద్య ఆరోగ్య ప‌రీక్షల ఆధారంగా.

శిక్షణ: ఎంపికైన వారికి 2023 జులైలో శిక్షణ ప్రారంభమవుతుంది. వీరు ఎజిమల నేవల్ అకాడమీ(కేరళ)లో నాలుగేళ్ల ఇంజినీరింగ్ (బీటెక్) డిగ్రీ పూర్తిచేయాల్సి ఉంటుంది. బీటెక్ స్పెషలైజేషన్లుగా.. అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ (లేదా) ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ బ్రాంచులు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.01.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 12.02.2023.

                                         

పూర్తి వివరాలకు 

Notification

Website 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్