Indian Navy Recruitment : ఇండియన్‌ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు


భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ నేవీ స్పెషల్‌ నావల్‌ ఓరియంటేషన్‌ కోర్సు జూన్‌ 2023 కింద.. 70 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళలు/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 


ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితోపాటు ఇంటర్మీడియల్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ లేదా బీసీఏ లేదా కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఎస్సీ/ ఎంసీఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే దరఖాస్తు దారులు తప్పనిసరిగా జులై 2, 1998 నుంచి జనవరి 1, 2004 మధ్య జన్మించి ఉండాలి.


ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 5, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.అక‌డ‌మిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి కేర‌ళ‌లోని ఎజిమ‌ళ‌లో ఉన్న ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ (ఐఎన్ఏ)లో శిక్షణ ఇస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు


 నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్