LIC Posts: దక్షిణ జోన్ పరిధిలో ఎల్ఐసీ ADO పోస్టులు 1408.. జిల్లాల వారీగా ఖాళీలు ఇలా

లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఎల్ఐసీ కార్యాలయాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏడీఓ) పోస్టుల భర్తీకి జోన్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది


మొత్తం 9394 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. దీనిలో హైదరాబాద్(Hyderabad) ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య జోనల్ కార్యాలయం పరిధిలోని వివిధ డివిజనల్ కార్యాలయాల్లో 1408 ఏడీఓ ఖాళీలున్నాయి. డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు, ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు.


దక్షిణ మధ్య జోన్‌లో డివిజన్ల వారీగా ఖాళీలు

జోన్ఖాళీలు
కడప 90
 హైదరాబాద్91
కరీంనగర్42
నెల్లూరు95
మచిలీపట్నం112
సికింద్రాబాద్94
 రాజమహేంద్రవరం69
వరంగల్62
విశాఖపట్నం57
బెంగళూరు 1115
బెంగళూరు 2117
ధార్వాడ్72
 బెల్గాం66
రాయచూర్83
మైసూర్108
ఉడిపి84
షియోగా51


అర్హతలు..

ఓపెన్ కేటగిరీ - భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ముంబయిలోని ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.

ఎల్‌ఐసి ఉద్యోగుల కేటగిరీ మరియు ఎల్‌ఐసి ఏజెంట్ల వర్గానికి, అర్బన్ మరియు రూరల్ రెండింటిలోనూ - దరఖాస్తుదారు భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.

వయోపరిమితి

కనీస వయో పరిమితి - 21 సంవత్సరాలు

గరిష్ట వయో పరిమితి - 30 సంవత్సరాలు

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, బీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు.

అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ముంబయిలోని ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.

వేతనం: నెలకు అప్రెంటిస్ సమయంలో రూ. 51,500 స్టైపెండ్ ఉంటుంది. ప్రొబేషనరీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గా నెలకు రూ. 35,650 నుంచి 90,205 వేతనం ఉంటుంది.


దరఖాస్తు..

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. జనవరి 21 నుంచి ఈ ప్రక్రియ ప్రారభం అయింది. ఫిబ్రవరి 10, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 12, 2023న నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 8, 2023న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://licindia.in సందర్శించొచ్చు.

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్