R & B Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. మరో 472 ఖాళీల భర్తీకి లైన్ క్లీయర్
తాజాగా మరో 472 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది ఆర్థిక శాఖ. రోడ్లు మరియు భవనాల శాఖలో ఈ ఖాళీలను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
![]() |
పాలపిట్టా |
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో కొత్తగా 472 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఆర్అండ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త పోస్టు లకు గత డిసెంబర్ 10న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఆర్ అండ్ బీ శాఖ ఆయా జిల్లాల్లో ఖాళీలు తదితర సమగ్ర సమాచారం సేకరించింది. గురువారం కొత్తగా 472 ఉద్యో గాలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
ఇందులో అత్యధికంగా 132 సివిల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి.
ఆ తర్వాత సివిల్లోనే 90 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజి నీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
గతంలో మంజూరు చేసిన 62 ఉద్యోగాలను రద్దు చేశారు. సీనియర్ స్టెనో (లోకల్ క్యాడర్), టైపిస్ట్ (హెచ్ఐవో), టైపిస్ట్ (లోకల్ క్యాడర్), టెక్నీషియన్ (హె చ్వో), ప్రింటింగ్ టెక్నీషియన్ (లోకల్ క్యాడర్), వాచ్మాన్(లో కల్ క్యాడర్), స్వీపర్ (లోకల్ క్యాడర్) పోస్టులను రద్దు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కొత్తగా అనుమతి ఇచ్చిన 472 పోస్టులతో కలిపితే..
ఇప్పటివరకు ఆర్థిక శాఖ 61,401 ఉద్యోగా లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే 43,099 పోస్టులకు ఆయా నియామక సంస్థలు నోటిఫికేషన్లు జారీచేశాయి.
రోడ్లు మరియు భవనాల శాఖలో ఈ ఖాళీలను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇంజనీర్ జాబ్స్ నుంచి స్వీపర్ జాబ్స్ వరకు మొత్తం 21 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది.
Qualification
ReplyDelete