TS Govt Jobs: తెలంగాణలో మరో 2,391 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ఏయే శాఖల్లో ఏయే పోస్టులున్నాయంటే..
తెలంగాణలో వరుస ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో 2,391 కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
వీటిలో.. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 480, జూనియర్ లెక్చరర్స్ 185 పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. పీజీటీ 235, టీజీటీ 324 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఈ పోస్టులకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
పోస్టుల వివరాల్లోకి వెళ్తే..
బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ నుంచి 141 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.
గ్రూప్ 4లోని జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు , మహాత్మాజ్యోతి బాఫూలే వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్ నుంచి అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు.. మరో 1499 టీజీటీ, పీజీటీ తదితర పోస్టులు కూడా బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ నుంచి అనుమతులు మంజూరయ్యాయి.
ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల కానుంది.
Comments
Post a Comment