TS High Court: తెలంగాణ జిల్లా కోర్టుల్లో 1226 ఖాళీలు, అర్హత లివే!

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్& సబార్డినేట్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. 


దీని ద్వారా మొత్తం 1,226 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అనర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో  జనవరి 11 నుంచి 31వ తేదీ లోగా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు..

★ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 

మొత్తం ఖాళీలు: 1226





అర్హత: ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులు అనర్హులు. అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాలను పేర్కొనాలి, అంతేకాకుండా స్థానిక భాషలు తెలిసి ఉండాలి.

వయోపరిమితి:  01.07.2022 నాటికి 18-34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఓసీ/ ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ: సీబీటీ/ ఓఎమ్మార్ పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం: మొత్తం 45 మార్కులకు  కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)/ ఓమ్మార్ రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 45 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. వీటిలో జనరల్ నాలెడ్జ్- 30 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్ ఇంగ్లిష్- 15 ప్రశ్నలు-15 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.

జీత భత్యాలు:  నెలకు రూ.19,000రూ.58,850 చెల్లిస్తారు.


ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్  దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 11.01.2023.

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2023.

🔰 హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: 15.02.2023.

🔰 కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: మార్చి 2023

Notification 

Website 


Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.