TS Police Recruitment: అర్హత మార్కులపై పోలీస్ నియామక మండలి స్పష్టత, వివరాలు ఇలా!
ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి నియామక ప్రక్రియలో ఈవెంట్స్ మరో రెండు రోజుల్లో ముగియనున్నాయి. దీంతో తుది రాత పరీక్ష నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్‌పీఆర్‌బీ) దృష్టి సారించింది.
మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు తుది రాతపరీక్షలు నిర్వహించేందుకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనేపథ్యంలో ప్రైమరీ రాతపరీక్షలో వలే అర్హత మార్కులు తగ్గించే అవకాశాలున్నాయా? అనే సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి.
గతంలో జనరల్ అభ్యర్థులకు 80.., బీసీలకు 70.., ఎస్సీ, ఎస్టీ/మాజీ సైనికోద్యోగులకు 60 అర్హత మార్కులుగా ఉండేవి. నియామక ప్రక్రియపై గతేడాది ఏప్రిల్ 25న వెలువడిన నోటిఫికేషన్‌లో మాత్రం ప్రైమరీ రాతపరీక్ష అర్హత మార్కుల్ని అన్ని వర్గాల అభ్యర్థులకూ 60 మార్కులుగానే నిర్ణయించారు.
అర్హత మార్కుల తగ్గింపు లేనట్లేప్రైమరీ రాతపరీక్ష ఫలితాలు వెల్లడించే తరుణంలో దీనిపై ఎస్సీ, ఎస్టీ/మాజీ సైనికోద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు కటాఫ్ మార్కుల్లో మార్పులు చేశారు. జనరల్ అభ్యర్థులకు 60.. బీసీ అభ్యర్థులకు 50.. ఎస్సీ, ఎస్టీ/మాజీ సైనికోద్యోగులకు 40 కటాఫ్ మార్కులుగా ఖరారు చేసి ప్రాథమిక రాతపరీక్ష ఫలితాల్ని ప్రకటించారు.
తుది రాతపరీక్షలోనూ కటాఫ్ మార్కుల తగ్గింపుపై ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అలాంటి అవకాశం లేదని జనరల్ అభ్యర్థులు 80, బీసీ అభ్యర్థులు 70, ఎస్సీ, ఎస్టీ/మాజీ సైనికోద్యోగులు 60 మార్కులు సాధిస్తేనే అర్హత సాధిస్తారని పోలీస్ నియామక మండలి స్పష్టం చేసింది.
తుది ఎంపిక ప్రక్రియ..
ప్రైమరీ రాతపరీక్షలో 5 తప్పుడు సమాధానాలకు ఒక మార్కును తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే తుది రాతపరీక్షలో నెగెటివ్ మార్కులు ఉండవు కాబట్టి రెండు విడతల పరీక్షల్లో ప్రశ్నపత్రాలు బహుళైచ్ఛిక సమాధానాలతో కూడినవే అవడంతో మండలి ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ప్రైమరీ రాతపరీక్షలో నెగెటివ్ మార్కుల విధానంలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇటు ఈవెంట్స్‌లోనూ అర్హత సాధించగలిగితేనే సత్తా ఉన్నట్లుగా పరిగణించి తుది రాతపరీక్షలో నెగెటివ్ మార్కుల విధానాన్ని తీసివేసినట్లు మండలి పేర్కొంది. అన్ని వర్గాల అభ్యర్థులు అర్హత మార్కుల్ని సాధిస్తేనే తుది ఎంపిక ప్రక్రియ కోసం పరిగణనలోకి తీసుకుంటామని మండలి ప్రకటించింది.

Comments
Post a Comment