TSLPRB Exam Dates Changed: పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. ఫైనల్ పరీక్ష తేదీల్లో మార్పులు..
తెలంగాణ పోలీస్ నియామకాలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయగా.. వాటికి ప్రిలిమ్స్, ఈవెంట్స్ నిర్వహించారు పోలీస్ నియామక బోర్డు. తాజాగా వీటికి సంబంధించి పరీక్ష తేదీలను కూడా ప్రకటించారు. అయితే వీటిలో మార్పు చేస్తూ తాజాగా మరో నోటీస్ విడుదల చేశారు.
ఈ నోటీస్ ప్రకారం కానిస్టేబుల్ పరీక్ష ను ఏప్రిల్ 30, 2023న నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల పిసీ సివిల్/ట్రాన్స్ పోర్ట్/ ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షను ఏప్రిల్ 24, 2023న నిర్వహించనున్నట్లు ప్రకటించిన బోర్డు తాజాగా దీనిని ఏప్రిల్ 30, 2023కు మార్చారు. దీంతో పాటు.. టెక్నికల్ (ఐటీ ఎస్సై) పరీక్షను మార్చి 12న నిర్వహించనుండగా.. దానిని మార్చి 11, 2023 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు, ఫింగర్ ప్రింట్ బ్యూర్ ఎస్సై పరీక్షను మార్చి 12 నుంచి మార్చి 11 మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు నిర్వహించనున్నారు.
అంతే కాకుండా.. కానిస్టేబుల్ ఐటీ పరీక్ష తేదీలో కూడా మార్పు చేశారు. మొదట ఏప్రిల్ 24, 2023న నిర్వహిస్తామని పేర్కొన్న బోర్డు దీనిని ఏప్రిల్ 30, 2023 మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక మిగిలిన పరీక్ష తేదీల్లో ఎలాంటి మర్పులు లేవని పేర్కొన్నారు.
ముందుగా ప్రటించిన తేదీల్లో ఇతర పరీక్షలు ఉన్నాయని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మార్పులు చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు కోసం వెబ్ నోట్ డౌన్ లోడ్ చేసుకోండి.
సమగ్రంగా ఇలా..
ఎస్సై (ఐటీ) - మార్చి 12, 2023 నుంచి మార్చి 11, 2023 తేదీకి మార్పు.
ఫింగర్ ప్రింట్ బ్యూరో (ఏఎస్సై) - మార్చి 12, 2023 తేదీ నుంచి మార్చి 11, 2023 తేదీకి మార్పు.
కానిస్టేబుల్ -ఏప్రిల్ 23, 2023 నుంచి ఏప్రిల్ 30, 2023 తేదీకి మార్పు.
కానిస్టేబుల్ (ఐటీ) - ఏప్రిల్ 23, 2023 నుంచి ఏప్రిల్ 30, 2023 వ తేదీకి మార్పు.
పూర్తి వివరాలకు కోసం వెబ్ నోట్ డౌన్ లోడ్
మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి లోగో పై క్లిక్ చేయండి
Comments
Post a Comment