TSNPDCL : విద్యుత్‌శాఖలో 157 ఉద్యోగాలు.. ఈనెల 23 దరఖాస్తులకు చివరితేది
తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSNPDCL) 157 ఛార్టర్డ్ అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సంస్థలో ఛార్టర్డ్ అకౌంటెంట్ విభాగంలో 157 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను హన్మకొండలోని TSNPDCL కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. జవనరి 23 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలను నోటిఫికేషన్ లేదా https://tsnpdcl.in/Careers వెబ్‌సైట్‌లో చూడొచ్చు
ముఖ్య సమాచారం:
ఛార్టర్డ్ అకౌంటెంట్ ఫిర్మ్ పోస్టులు
కాంట్రాక్ట్ వ్యవధి: 2 సంవత్సరాలు.
మొత్తం పోస్టుల సంఖ్య: 157
జిల్లాల వారీగా ఖాళీలు: హనుమకొండ-11, వరంగల్-10, జనగాం-08, మహబూబాబాద్-08, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి-07, కరీంనగర్-13, పెద్దపల్లి-10, జగిత్యాల-09, ఖమ్మం-15, బద్రాద్రి కొత్తగూడెం-10, నిజామాబాద్-16, కామారెడ్డి-11, ఆదిలాబాద్-07, నిర్మల్-07, మంచిర్యాల-08, కుమురంభీం-ఆసిఫాబాద్-06, కార్పొరేట్ ఆఫీస్-01 ఖాళీలు ఉన్నాయి.
![]() |
పిక్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
అర్హతలు: అభ్యర్థులు సీఏ, సీఐఎస్‌ఏ/ డీఐఎస్‌ఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతో పాటు ఈఆర్‌పీ/ఎస్‌ఏపీలో కనీస పరిజ్ఞానంతో పాటు సంబంధిత విభాగంలో మూడేళ్ల పని అనుభం ఉండాలి.
పని అనుభవం: కనీసం 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
జీతభత్యాలు: రూ.35,000.
దరఖాస్తులు సమర్పించాల్సిన చిరునామా:
TSNPDCL, Corporate Office, 3rd Floor,
Vidyuth Bhavan, Nakkalagutta,
Hanamkonda-506 001, Telangana.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: జనవరి 23, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://tsnpdcl.in/Careers
꧁𝚃𝙾 𝙹𝙾𝙸𝙽 𝚃𝙴𝙻𝙰𝙽𝙶𝙰𝙽𝙰 𝙶 𝙺 𝙶𝚁𝙾𝚄𝙿𝚂꧂
Comments
Post a Comment