TSPSC Group1 Prelims Results: 'గ్రూప్-1' ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల! పరీక్ష ఎప్పుడంటే?

ప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ గ్రూప్ – 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. పండుగకు ఒక రోజు ముందే టీఎస్పీఎస్సీ రిజల్స్ ను రిలీజ్ చేసింది,  పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచింది.


తెలంగాణ రాష్ట్ర తొలి 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 13న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచింది. గ్రూప్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్ఫత్తిలో 25,050 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్‌సీ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.  జూన్‌లో గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది.


కాగా.. మొత్తం 503 గ్రూప్-1 పోస్టు‌లకు అక్టోబ‌ర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. వీటికి 3,80,081 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. 2,85,916 మంది హాజ‌ర‌య్యారు. అక్టోబ‌ర్ 29న ప్రాథ‌మిక కీ విడుద‌ల అయింది. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని 5 ప్రశ్నల‌ను తొల‌గించింది. అనంత‌రం న‌వంబ‌ర్ 15వ తేదీన ఫైనల్ కీ ని ప్రకటించింది.


మల్టీజోన్‌, రిజర్వుడ్‌ వర్గాల వారీగా జాబితాను టీఎస్‌పీఎస్సీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఫలితాలు వెల్లడైనా వెంటనే మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు కమిషన్‌ భావిస్తోంది. అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్న గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష తేదీపై వారం, పదిరోజుల్లోనే స్పష్టత రానుంది.


గ్రూప్-1 ఫలితాల కోసం క్లిక్ చేయండి..

https://drive.google.com/file/d/1U3lnnfD1yguKYkB-xnyN7TM7rjLwWC2H/view



మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి లోగో పై క్లిక్ చేయండి 



Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.