TSPSC Librarian Recruitment 2022: తెలంగాణలో 71 లైబ్రేరియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు, ఎంపిక విధానం, అప్లికేషన్ వివరాలు ఇవే..
తెలంగాణ రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్యలో 71 లైబ్రేరియన్ (కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్) పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీయస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది.
ఇంటర్మీడియట్ విద్య విభాగంలో 40, సాంకేతిక విద్య విభాగంలో 31 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు మే లేదా జూన్‌లో రాతపరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది.
ఖాళీల వివరాలు:
1. లైబ్రేరియన్ (కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్): 40 పోస్టులు
అర్హత: 50% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్(లైబ్రరీ సైన్స్) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
2. లైబ్రేరియన్ (కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్): 31 పోస్టులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (లైబ్రరీ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ డాక్యుమెంటేషన్ సైన్స్)తో పాటు జాతీయ స్థాయి పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. లేదా మాస్టర్స్ డిగ్రీతో పాటు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)/ స్లెట్/ సెట్ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం ఖాళీల సంఖ్య: 71
వయోపరిమితి: 01/07/2022 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు లైబ్రేరియన్‌కు (ఇంటర్ విద్య)- రూ.54,220-రూ.1,33,630; లైబ్రేరియన్(సాంకేతిక విద్య)- లెవల్-9ఎ రూ.56,100, లెవల్-10 రూ.57,700.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) పేపర్-1, పేపర్-2, ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు, పరీక్ష రుసుము: రూ.320.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 21/01/2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10/02/2023.
పరీక్ష తేదీ (ఆబ్జెక్టివ్ టైప్): మే/ జూన్/ 2023.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Comments
Post a Comment