Union Bank Jobs: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వీరికి ప్రత్యేకం! ఈ అర్హతలు ఉండాలి 



దీనిద్వారా 42 చార్టర్డ్ అకౌంటెంట్, క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జనవరి 23 నుంచి ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు


వివరాలు...

మొత్తం ఖాళీలు: 42


పోస్టుల వారీగా ఖాళీలు..

1) చార్టర్డ్ అకౌంటెంట్: 03 పోస్టులు
పోస్టుల కేటాయింపు: ఎస్టీ-01, ఓబీసీ-02.
అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి. 
అనుభవం: చార్టర్డ్ అకౌంటెంట్‌గా కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. బ్యాంకులు, బ్యాంకింగ్ సంస్థలు, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, ఫైనాన్షియల్ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 25 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

2) సీనియర్ మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్): 34 పోస్టులు
పోస్టుల కేటాయింపు: ఎస్టీ-10, ఎస్టీ-13, ఓబీసీ-11.
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. సీఏఐఐబీ/ఎంబీఏ(ఫైనాన్స్)/సీఎంఏ/సీఏ/సీఎఫ్‌ఏ/సీఎస్ అర్హత ఉండాలి. 
అనుభవం:  కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎంఎస్‌ఎంఈ, కార్పొరేట్ క్రెడిట్ (షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్) విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 25 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

3) మేనేజర్ (క్రెడిట్ ఆఫీసర్): 05 పోస్టులు
పోస్టుల కేటాయింపు: ఎస్టీ-05.
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. సీఏఐఐబీ/ఎంబీఏ(ఫైనాన్స్)/సీఎంఏ/సీఏ/సీఎఫ్‌ఏ/సీఎస్ అర్హత ఉండాలి. 
అనుభవం:  కనీసం 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎంఎస్‌ఎంఈ, కార్పొరేట్ క్రెడిట్ (షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్) విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 22 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు...

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.01.2023.

➥ దరఖాస్తు చివరి తేది:12.02.2023.

పిడిఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్