Zomato: జొమాటో కొత్త రిక్రూట్‌మెంట్.. 800 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్..


 జొమాటో (Zomato) భారీ సంఖ్యలో ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ విషయంపై జొమాటో సీఈవో దీపిందర్ గోయెల్ లింక్‌డ్ఇన్(LinkedIn)లో చేసిన ఓ పోస్టు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తమ కంపెనీలో వివిధ విభాగాల్లో 800 ఖాళీలు ఉన్నాయని గోయెల్ ప్రకటించడం సంచలనంగా మారింది. మొత్తం ఐదు జాబ్ రోల్స్‌లో ఈ ఖాళీలు ఉన్నాయని గోయెల్ తెలిపారు. ఈ ఐదు జాబ్ ప్రొఫైల్స్‌ను ఆయన షేర్ చేశారు.


ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా బడా కంపెనీలు ఖర్చును తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగా వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్నాయి. అనవసరంగా అనిపించిన ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. అయితే, జొమాటో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు వెల్లడించింది. ఐదు రోల్స్‌కు సంబంధించిన ఖాళీలు, కావాల్సిన నైపుణ్యాలు తదితర వివరాలను వెల్లడిస్తూ సీఈవో దీపిందర్ గోయెల్ పోస్ట్ చేశారు. మరింత సమాచారం కోసం మెయిల్ చేయాలని యూజర్ ఐడీ కూడా ఇచ్చారు. ఖాళీలు ఉన్న ఐదు రోల్స్ గురించి తెలుసుకోవడానికి deepinder@zomato.comకు మెయిల్ చేయాలని సూచించారు.



* చీఫ్ ఆఫ్ స్టాఫ్ టు సీఈవో(Chief of Staff to CEO)


గోయెల్ ప్రకటించిన ఐదు రోల్స్‌లో కీలకమైన పోస్టు ఇది. జొమాటో, హైపర్ ప్యూర్, బ్లింకిట్ సీఈవోలకు చీఫ్‌ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహిరించేందుకు ఒక ఉద్యోగి కావాలట. ఈ పోస్టుకి ఎంపికైన వారు ఫోర్స్ మల్టిప్లైయర్‌గా పనిచేయాల్సి ఉంటుంది. సంస్థకు మినీ సీఈవో పదవి వంటిది. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ పోస్టుకు అప్లై చేయాలని గోయెల్ కోరారు. లింక్‌డ్‌ఇన్‌లో ఈ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు, కావాల్సిన నైపుణ్యాలు తదితర వివరాలను పొందపర్చారు. వాటిని చూడొచ్చని సీఈవో అందులో పేర్కొన్నారు.


జనరలిస్టు (Generalist)


జొమాటోలోని నాయకత్వ బృందాలను సమన్వయం చేసుకుంటూ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలన్న ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చని గోయెల్ తెలిపారు. ఫుడ్ డెలివరీ బిజినెస్‌లో తగిన వ్యూహాలతో వ్యాపారాన్ని ముందుకు నడిపించగల సామర్థ్యం ఉండాలని ఇందులో కోరారు.



* గ్రోత్ మేనేజర్ (Growth Manager)


గ్రోత్ మేనేజర్లు జొమాటో రెస్టారెంట్ పార్ట్‌నర్స్‌తో కో ఆర్డినేట్ కావాల్సి ఉంటుంది. నిరంతరం ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహార సరఫరా జరిగేలా గ్రోత్ మేనేజర్లు పనిచేయాలని అందులో సూచించారు.


* ప్రొడక్ట్ మేనేజర్ లేదా ప్రొడక్ట్ ఓనర్ (Product Owner)


ప్రొడక్ట్ మేనేజర్లు వినియోగదారుల అభిప్రాయాలు, సూచనలను స్వీకరించాల్సి ఉంటుంది. అనంతరం వీటిని విశ్లేషించి తదనుగుణంగా ఉత్పత్తులను తీర్చిదిద్దాల్సి ఉంటుంది.

గ్రోత్ మేనేజర్ (Growth Manager)


గ్రోత్ మేనేజర్లు జొమాటో రెస్టారెంట్ పార్ట్‌నర్స్‌తో కో ఆర్డినేట్ కావాల్సి ఉంటుంది. నిరంతరం ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహార సరఫరా జరిగేలా గ్రోత్ మేనేజర్లు పనిచేయాలని అందులో సూచించారు.


* ప్రొడక్ట్ మేనేజర్ లేదా ప్రొడక్ట్ ఓనర్ (Product Owner)


ప్రొడక్ట్ మేనేజర్లు వినియోగదారుల అభిప్రాయాలు, సూచనలను స్వీకరించాల్సి ఉంటుంది. అనంతరం వీటిని విశ్లేషించి తదనుగుణంగా ఉత్పత్తులను తీర్చిదిద్దాల్సి ఉంటుంది.



హైదరాబాద్ వండర్లా విశేషాలు

https://youtu.be/7RfVxXCdZvE

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్