పోస్టాఫీసులో 40,889 ఉద్యోగాల భర్తీకి రేపటితో ( FEB 16 )ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 40,889 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ జనవరి 27న ప్రారభంకాగా.. ఫిబ్రవరి 16తో గడువు ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు సమర్పించాలి. పదోతరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు.
ఆంధ్రప్రదేశ్లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 40,889
* గ్రామీణ డాక్ సేవక్స్- బ్రాంచ్ పోస్టు మాస్టర్/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్/ డాక్ సేవక్
జీత భత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
దరఖాస్తు విధానం: దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు:
➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.01.2023.
➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 16.02.2023.
➥ దరఖాస్తు సవరణలకు అవకాశం: 17.02.2023 నుంచి 19.02.2023 వరకు.
ముఖ్యమైన తేదీలు:
➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.01.2023.
➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 16.02.2023.
➥ దరఖాస్తు సవరణలకు అవకాశం: 17.02.2023 నుంచి 19.02.2023 వరకు.
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
Kota, prasannakumar
ReplyDelete