Agniveer Recruitment: అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కీలక మార్పులు..

 భారత సైన్యం


(Indian Army)లో యువత ప్రాధాన్యం పెంచేందుకు, ఎక్కువ మందికి ఉపాధి కల్పించేందుకు కేంద్రం అగ్రిపథ్‌ స్కీమ్‌ తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఇండియన్ ఆర్మీలో తాత్కాలిక పద్దతిలో నియామకాలు చేపడుతారు.



 ఇప్పటికే కొన్ని విడతల రిక్రూట్‌మెంట్‌ పూర్తయింది. ఈ స్కీమ్ కింద ఎంపికైన అభ్యర్థులను అగ్నివీర్స్ (Agniveer) అంటారు. ప్రస్తుతం అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో ఇండియన్ ఆర్మీ కీలక మార్పు చేసినట్లు ప్రకటించింది. రక్షణ దళాల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఇకపై మొదటగా ఆన్‌లైన్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాల్సి ఉంది. ఆ తరువాత ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఉంటుంది.


* ఫిబ్రవరి మధ్యలో కొత్త నోటిఫికేషన్

అగ్నివీర్స్ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో తాజా మార్పు తరువాత కొత్త నోటిఫికేషన్ ఈనెల మధ్యలో వెలువడే అవకాశం ఉన్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అగ్నివీర్స్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొదటిసారిగా కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(CEE) ఏప్రిల్‌లో 200 సెంటర్స్‌లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం.


* మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ

అగ్నివీర్స్ ఎంపికలో మొత్తంగా మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో కేటాయించిన సెంటర్లలో అభ్యర్థులందరికీ ఆన్‌లైన్‌లో కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రెండో దశలో ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇక, మూడో దశలో మెడికల్ టెస్ట్ ఉండనుంది. 2023-24కు సంబంధించి సైన్యంలో చేరేందుకు సిద్ధంగా ఉన్న దాదాపు 40,000 మంది అభ్యర్థులను కొత్త పద్దతిలో రిక్రూట్‌ చేసుకోనున్నారు.



* ర్యాలీలు ఇకపై సులభతరం

కొత్త పద్దతి(CEE) ద్వారా సెలక్షన్ సమయంలో మరింత దృష్టిసారించడానికి అవకాశం ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా విస్తృత వ్యాప్తితో రిక్రూట్‌మెంట్ ర్యాలీల సమయంలో ఎక్కుడ మంది పోగవడం తగ్గిస్తుంది. ర్యాలీలను మరింత మెరుగ్గా, సులభంగా నిర్వహించేలా చేస్తుందని అధికారులు తెలిపారు.


కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                     

       

                           


* గతంలో ఎంపిక ప్రక్రియ ఇలా

ఇప్పటివరకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ముందుగా ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించేవారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్‌, చివరగా రాత పరీక్ష ఉండేది. అయితే ఇప్పుడు, కామన్ ఆన్‌లైన్ CEE మొదటి దశలో నిర్వహించనున్నారు. కొత్త పద్దతి ద్వారా స్క్రీనింగ్ ప్రక్రియ, లాజిస్టిక్స్‌ సులభతరం అవుతుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.


* తాత్కాలిక నియామకాల కోసం

అగ్నివీర్స్‌ను త్రివిధ దళాల్లో నాలుగేళ్ల సర్వీస్ కాలానికి ఎంపిక చేస్తారు. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారి జీతం నెలకు రూ.30-40 వేల రూపాయల మధ్య ఉంటుంది. రిక్రూట్ అయిన వారిలో 25 శాతం మంది నాలుగేళ్ల సర్వీస్ తరువాత ఇండియన్ ఆర్మీలో కొనసాగుతారు.

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.