AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సికింద్రాబాద్ లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్‌మ్యాన్ మేట్, ఫైర్‌మ్యాన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 6 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఫిబ్రవరి 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 1,793
రీజియన్లు: ఈస్ట్రన్, వెస్ట్రన్, నార్తర్న్, సదరన్, సౌత్ వెస్ట్రన్, సెంట్రల్ వెస్ట్, సెంట్రల్ ఈస్ట్.
1) ట్రేడ్స్‌మ్యాన్ మేట్: 1249 పోస్టులు
అర్హతలు: పదోతరగతి అర్హతతోపాటు ఐటీఐ ఉండాలి.
2) ఫైర్‌మ్యాన్: 544 పోస్టులు
అర్హతలు: పదోతరగతి అర్హత ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జీత భత్యాలు: నెలకు ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు రూ.18,000 నుంచి రూ.56,900; ఫైర్‌మ్యాన్ ఖాళీలకు రూ.19,900 నుంచి రూ.63,200 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎండ్యూరెన్స్/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.02.2023.
➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 26.02.2023.
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
Sumanth
ReplyDeleteI want this jood
DeleteSumanth
ReplyDelete