BSF : 1410 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. 10వ తరగతితో పాటు ఈ అర్హతలుండాలి
కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF).. 1410 కానిస్టేబుల్ (ట్రేడ్‌మ్యాన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 10వ తరగతిలో ఉత్తీర్ణతతో పాటు ప్లంబర్/పెయింటర్/ఎలక్ట్రీషియన్/పంప్ ఆపరేటర్/డ్రాఫ్ట్‌మ్యాన్/టిన్‌స్మిత్/టైలర్/కాబ్లర్/బార్బర్/మాలి/స్వీపర్/వాషర్‌మ్యాన్/కుక్/వాటర్ క్యారియర్/వెయిటర్/బట్చర్ తదితర స్పెషలైజేషన్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కూడా ఉండాలి.
అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా శారీరక కొలతలు కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఖచ్చితంగా 18 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష/ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. అభ్యర్థులు పూర్తి వివరాలను నోటిఫికేషన్ లేదా https://bsf.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
Comments
Post a Comment