DMHO Recruitment: రంగారెడ్డి జిల్లాలో 49 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం జాతీయ ఆరోగ్య మిషన్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. వివరాలు ఇలా..
రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం జాతీయ ఆరోగ్య మిషన్ ఒప్పంద ప్రాతిపదికన పలు మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీని ద్వారా మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిభ్రవరి 15 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు.
వివరాలు..
మెడికల్ ఆఫీసర్: 49 పోస్టులు
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500. అభ్యర్థులు DMHO, Ranga Reddy పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయానికి వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా అందచేయాలి.
ఎంపిక విధానం: ఎంబీబీఎస్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం: నెలకు రూ.52,000.
దరఖాస్తు స్వీకరణ చివరితేదీ: 15-02-2023
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
Comments
Post a Comment