IDBI Recruitment 2023: రూ.89,000 వేతనంతో ఐడీబీఐ బ్యాంకులో 114 ఉద్యోగాలు...
బ్యాంక్ జాబ్ కోరుకునేవారికి అలర్ట్. ఐడీబీఐ బ్యాంకులో (IDBI Bank) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. మొత్తం 114 పోస్టులున్నాయి. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకులో 600 ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 114 పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ మొదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 2023 మార్చి 3 చివరి తేదీ
దరఖాస్తు ప్రారంభం- 2023 ఫిబ్రవరి 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2023 మార్చి 3
వయస్సు- 25 ఏళ్ల నుంచి 45 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200.
వేతనం- డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు రూ.89,892. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుకు రూ.78,230. మేనేజర్ పోస్టుకు రూ.69,810.
ఐడీబీఐ బ్యాంకు స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయండి ఇలా
Step 1- అభ్యర్థులు ముందుగా https://www.idbibank.in/ అధికారిక వెబ్సైట్లో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి.
Step 2- Recruitment of Specialist Officer నోటిఫికేషన్తో ఓ సెక్షన్ కనిపిస్తుంది.
Step 3- నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత Apply Online పైన క్లిక్ చేయాలి.
Step 4- కొత్త వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.
Step 5- మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.
Step 6- మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
Step 7- రెండో దశలో ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
Step 8- మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
Step 9- నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.
Step 10- ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి.
Step 11- ఆరో దశలో ఫీజు పేమెంట్ చేయాలి.
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
Comments
Post a Comment