ONGC Scholarships: బీటెక్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్
ONGC Scholarships : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) 2021-22 విద్యా సంవత్సరానికిగాను కింది స్కాలర్‌షిష్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా 2000 స్కాలర్‌షిప్‌లు అందించనుంది. వివరాల్లోకెళ్తే..
ONGC Scholarships 2021-22
స్కాలర్‌షిప్ స్కీం ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు: 1000
స్కాలర్‌షిప్ స్కీం ఓబీసీ విద్యార్థులు: 500
స్కాలర్‌షిప్ స్కీం జనరల్/ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు: 500
ముఖ్య సమాచారం:
అర్హత: ఇంజినీరింగ్/ ఎంబీబీఎస్/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత ఉండాలి. 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్ అందుతుంది.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, క్వాలిఫైయింగ్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: మార్చి 06, 2023.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ongcscholar.org/
నోటిఫికేషన్
https://telugu.samayam.com/photo/97164423.cms
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
This comment has been removed by a blog administrator.
ReplyDelete