Telangana Job Mela: తెలంగాణలో 9 వేల జాబ్స్ కు రేపే ఇంటర్వ్యూలు.. రూ.లక్ష వరకు జీతం.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గం కేంద్రంలో భారీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ నేత, కోదాడ నియోజకవర్గ మాజీ ఇన్ ఛార్జి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ జాబ్ మేళాను ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు.
ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 72 కంపెనీల్లో 9 వేలకు పైగా ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏఏ విభాగాల్లో అంటే: ఈ జాబ్ మేళా ద్వారా ఐటీ, మెడికల్, మార్కెంటింగ్, మేనేజ్మెంట్, హోటల్స్, ఇండస్ట్రీలు, బీపీఓ, డేటా ఎంట్రీ, నర్సింగ్, ఫార్మా రంగాల్లో ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు
విద్యార్హతలు
7, 10, ఇంటర్, గ్రాడ్యుయేట్, ఐటీఐ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, బీఏ, బీఎస్సీ, బీకాం, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంసీఎస్ తదితర విద్యార్హతలు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. మూగ, చెవిటి, దివ్యాంగులు కూడా అప్లై చేసుకోవచ్చు.
వేతనం: ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్-https://docs.google.com/forms/d/e/1FAIpQLScDxcbMzMfR72rpDhHCV6tUHEF8V39Ca-51ICRz6inGfeHDCQ/viewform
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
Comments
Post a Comment