TSPSC Group 3 Posts: పెరిగిన 'గ్రూప్‌-3' ఉద్యోగాల సంఖ్య , మొత్తం ఖాళీలు ఎన్నంటే?

బీసీ గురుకుల సొసైటీ పరిధిలో అదనంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పెంచారు. ఇప్పటికే 26 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రకటనలో పేర్కొనగా.. తాజాగా పెంచిన 12 పోస్టులతో కలిపి ఆ పోస్టులు 38కి చేరాయి..


 ఈ మేరకు పూర్తి వివరాలను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు కమిషన్ తెలిపింది. కొత్తగా చేరిన 12 పోస్టులతో కలిపి మొత్తం గ్రూప్-3లో పోస్టుల సంఖ్య 1,375కి చేరింది..

ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు..


గ్రూప్-3 ఉద్యోగాలకు జనవరి 24న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 23 వరకు కొనసాగనుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించి, దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు..


పోస్టుల వివరాలు..


* గ్రూప్-3 పోస్టులు


పోస్టుల సంఖ్య: 1375


1) జూనియర్ అసిస్టెంట్: 667 పోస్టులు

2) సీనియర్ అకౌంటెంట్: 436 పోస్టులు

3) ఆడిటర్: 126 పోస్టులు

4) సీనియర్ ఆడిటర్: 61 పోస్టులు

5) అసిస్టెంట్ ఆడిటర్: 23 పోస్టులు

6) జూనియర్ అకౌంటెంట్: 61 పోస్టులు 

7) అకౌంటెంట్: 01 పోస్టు


అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 


కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                        


వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.280. ఇందులో రూ.200 ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు కింద, రూ.80 పరీక్ష ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. 

నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

 ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది


Notification

Online Application 

నోటిఫికేషన్, పరీక్ష విధానం వివరాల కోసం క్లిక్ చేయండి.. 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.