TSPSC Group 4 Exam Date: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్ష తేదీని ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ.. ఇంతకీ ఎగ్జాం ఎప్పుడంటే..

తెలంగాణలో గ్రూప్ 4 పరీక్ష తేదీ ఖరారైంది. గ్రూప్ 4 పరీక్షను జులై 1న నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. 

ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష(Exam) ఉంటుందని ప్రకటించింది. ఇక తెలంగాణలో గ్రూప్-4(TSPSC Group 4) ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును టిఎస్‌పిఎస్‌సి ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. 
టిఎస్‌పిఎస్‌సి గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సోమవారం(జనవరి 30)తో దరఖాస్తు గడువు ముగియనుండగా.. తాజాగా గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 8,180 గ్రూప్ 4 పోస్టులకు 8,47,277 మంది దరఖాస్తు చేసుకున్నట్టు కమిషన్ తెలిపింది.

గత ఆదివారం ఒక్కరోజే 58,845 మంది దరఖాస్తు చేసుకోగా.. సోమవారం కొత్తగా మరో 34,247 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. ఈ ఉద్యోగాలకు భారీ స్పందన వస్తుండటంతో సర్వర్‌పై ఒత్తిడి అనూహ్యంగా పెరిగి దరఖాస్తు ఫారం పూర్తి చేశాక ఫీజు చెల్లింపులో అభ్యర్థులకు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి
దాంతో కమిషన్ దరఖాస్తు గడువును పొడిగించింది. 
రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లోని 25 విభాగాల్లో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి 2022 డిసెంబర్‌లో టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్ ఇచ్చింది.

కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                        

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.