TSSPDCL: టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో 1553 జూనియర్ లైన్‌మెన్ పోస్టులు

 పదోతరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు.


సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్) పరిధిలో ఖాళీగా ఉన్న 1553 జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పదోతరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 8 నుంచి మార్చి 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 1553

* జూనియర్ లైన్‌మెన్ పోస్టులు
* లిమిటెడ్ రిక్రూట్‌మెంట్(LR): 553; జనరల్ రిక్రూట్‌మెంట్(GR): 1000.
అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/వైర్‌మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) అర్హత ఉండాలి.

వయోపరిమితి: 01.01.2023 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.  
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. వీటిలో 80 మార్కులు రాతపరీక్షకు, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టీషియన్స్, ఔట్‌సోర్సింగ్ అభ్యర్థులకు 20 మార్కుల వెయిటేజీ వర్తిస్తుంది.


కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                        



పరీక్ష విధానం: మొత్తం 80 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 80 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్షలో రెండు సెక్షన్లు (సెక్షన్-ఎ, సెక్షన్-బి) ఉంటాయి. సెక్షన్-ఎ (కోర్ ఐటీఐ సబ్జెక్ట్) నుంచి 65 ప్రశ్నలు, సెక్షన్-బి (జనరల్ నాలెడ్జ్) నుంచి 15 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో కనీస అర్హత మార్కులకు ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 % (40 మార్కులు), బీసీ అభ్యర్థులకు 35 % (35 మార్కులు), ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 30 % (30 మార్కులు) గా నిర్ణయించారు. 

సిలబస్ వివరాలు..

జీతభత్యాలు: నెలకు రూ. 24,340 – 39,405 చెల్లిస్తారు.

పరీక్ష కేంద్రాలు: జీహెచ్‌ఎంసీ/హెచ్‌ఎండీఏ పరిధిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభతేదీ: 08.03.2023.
దరఖాస్తు చేయడానికి చివరితేదీ: 28.03.2023.
➽ అప్లికేషన్ సవరణ తేదీలు: 01.04.2023 నుండి 04.04.2023 వరకు
హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్: 24.04.2023.
➽ పరీక్ష తేదీ: 30.04.2023.

 పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

Notification

Website 

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.