TSSPDCL : విద్యుత్‌శాఖలో జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

 జూనియర్‌ లైన్‌మెన్‌ (JLM) పోస్టులు ఉన్నాయి. జిల్లాల వారీగా పోస్టులు, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలకు ఫిబ్రవరి 15 తర్వాత సంస్థ వెబ్‌సైట్‌లో చూడాలని TSSPDCL వెల్లడించింది.



తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ జాతర కొనసాగుతోంది. తాజాగా దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) 1,601 పోస్టుల భర్తీకి ఫిబ్ర‌వ‌రి 2న‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. 

ఇందులో 

  1. 48 అసిస్టెంట్‌ ఇంజినీర్‌(AE)ఎలక్ట్రికల్‌, 
  2. 1,553 జూనియర్‌ లైన్‌మెన్‌ (JLM) పోస్టులు ఉన్నాయి.

 జిల్లాల వారీగా పోస్టులు, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలకు ఫిబ్రవరి 15 తర్వాత సంస్థ వెబ్‌సైట్‌లో చూడాలని TSSPDCL వెల్లడించింది. 

జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి గతేడాది మేలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఆగస్టు నెలలో TSSPDCL రద్దు చేసింది. 

జులై 17న జరిగిన రాత పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఉద్యోగార్థులు నష్టపోకూడదని రద్దు చేస్తున్నట్లు అప్పట్లో సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. గతంలో 1,000 జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. 

ఈ సంఖ్య తాజా నోటిఫికేషన్‌లో 1,553కి పెరిగింది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు పూర్తి వివరాలను https://www.tssouthernpower.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.


కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 


                                                   

                                    

Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.