UPSC CSE 2023: యూపీఎస్సీ నుంచి భారీగా నోటిఫికేషన్.. 1105 పోస్టులు భర్తీ.. పూర్తి వివరాలివే..!

దేశంలో అత్యున్నత సర్వీసుల్లో నియామకానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఏటా సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తుంది. 


ఈ ఏడాది భారీగా 1105 మంది అభ్యర్థులను రిక్రూట్‌ చేసుకోనుంది. తాజాగా యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
అభ్యర్థులు upsc.gov.in లో ఫిబ్రవరి 21 వరకు (సాయంత్రం 6:00 గంటల వరకు) దరఖాస్తు చేసుకోవచ్చు.  మెయిన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌(ప్రిలిమినరీ) మే 28న నిర్వహించనున్నారు. అధికారిక నోటీసు ప్రకారం ఈ ఏడాది నవంబర్‌లో మెయిన్స్ ఎగ్జామ్‌ జరిగే సూచనలు ఉన్నాయి
అర్హత ప్రమాణాలు : వయోపరిమితి: 2023 ఆగస్టు 1 నాటికి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు ఉన్న వాళ్లు అర్హులు. అయితే రిజర్వ్ కేటగిరీకి చెందిన వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
విద్యార్హత: అభ్యర్థులు బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, పశుసంవర్ధక, వెటర్నరీ సైన్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ సబ్జెక్టులలో కనీసం ఒకదానిలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయం, అటవీ శాస్త్రం లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి

రిజిస్టర్‌ చేసుకోవడం ఎలా? : సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ 2023కి అప్లై చేయాలంటే 
  1. అభ్యర్థులు ముందుగా UPSC అధికారిక వెబ్‌సైట్‌ upsconline.nic.in ఓపెన్‌ చేయాలి. 
  2. అక్కడ హోమ్‌ పేజీలో 'OTR ఫర్‌ ఎగ్జామినేషన్స్‌ ఆఫ్‌ UPSC అండ్‌ ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌’ లింక్‌పై క్లిక్‌ చేయాలి. 
  3. కొత్తగా ఓపెన్‌ అయిన వెబ్‌పేజీలో పార్ట్ 1 రిజిస్ట్రేషన్ ఫారం పూర్తి చేయాలి 
  4. ఫీజు చెల్లించి, అన్ని అవసరమై డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి. 
  5. అనంతరం పరీక్షా కేంద్రాన్ని సెలక్ట్‌ చేసుకొని, సూచించిన విధంగా అప్లికేషన్‌ ఫారం సబ్మిట్‌ చేయాలి.
  6. చివరిగా UPSC IFS ఫారం సేవ్ చేసి డౌన్‌లోడ్ చేయాలి. 
  7. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ ప్రింట్‌అవుట్‌ తీసుకోవడం మేలు.

లింగ సమతౌల్యాన్ని ప్రతిబింబించే వర్క్‌ఫోర్స్‌ కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రోత్సహిస్తుందని అధికారిక నోటీసు పేర్కొంది. అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి నోటిఫికేషన్‌ అందుబాటులో ఉంటుంది

*ఏడేళ్లలో అత్యధిక పోస్టులు : ఈసారి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా అత్యధికంగా 1105 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమీషన్ నోటిఫై చేసింది. గత ఏడేళ్లలో ఇవే అత్యధిక పోస్టులు కావడం గమనార్హం. గతేడాది 1011 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. 2016లో చివరిసారిగా 1000కు పైగా పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ జరిగింది. 2017లో 980, 2018లో 782, 2019లో 896, 2020లో 796 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. 2021లో 712 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు



కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                        

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.