ఇక్కడ గ్రంథాలయం లో రేయింబవళ్లూ 24/7 చదువుకోవచ్చు

24 గంటలూ తెరిచి ఉండే మొట్టమొదటి జిల్లా గ్రంథాలయం


రాష్ట్రంలో పోలీస్, గ్రూప్స్ పరీక్షల్లో విజయం సాధించి.. కొలువు కల సాకారం చేసుకోవడమే. లక్ష్యంగా అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. 

ఇలాంటివారికి కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయం బాసటగా నిలుస్తోంది. 24 గంట లపాటూ చదువుకొనే వెసులుబాటు కల్పిస్తోంది. 2022 ఏప్రిల్ నుంచి ఈ సదుపాయాన్ని అందు బాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో రేయింబవళ్లు తెరిచిఉండే గ్రంథాలయం ఇదొక్కటే కావడం విశేషం. కొందరు రాత్రంతా ఇక్కడే ఉండి చదు వుతున్నారు. మరికొందరు అర్ధరాత్రి వరకు చదువుకొని ఇళ్లకు వెళ్లి.. మళ్లీ వేకువజామున వస్తున్నారు. ఇక్కడ చదివిన 20 మందికి పైగా అభ్యర్థులు గ్రూప్-1 ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. "పోటీ పరీక్షలకు సంబంధించి అభ్య ర్థులు కోరిన (ఆన్ డిమాండ్) పుస్తకాలను ఒక ట్రెండు రోజుల్లో తెప్పిస్తున్నాం. నా వ్యక్తి గత ఆసక్తితో రూ.25 వేల విలువైన పుస్తకాలు తెప్పించాను. 24 గంటలూ తాగునీరు అందేలా

ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశాం" అని జిల్లా. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పొన్నం అనిల్కుమా ర్ గౌడ్ తెలిపారు.


ప్రత్యేకతలివీ..


  • గ్రంథాలయానికి నిత్యం 1,500 మందికి పైగా వస్తుంటారు.
  • మొత్తం 75,807 పుస్తకాలున్నాయి.
  • మొత్తం ఆరు గదులుండగా.. యువకులకు 4, యువతులకు 2 కేటాయించారు. 600కు పైగా కుర్చీలున్నాయి.
  • గ్రంథాలయం ఆరుబయట కూర్చుని చదువుకునే విద్యార్థుల కోసం హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు.
  • మధ్యాహ్నం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.5కే భోజనం పెడుతున్నారు.
  • తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలున్నాయి.

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.