కేంద్ర విశ్వ విద్యాలయాల్లో ఖాళీగా 6,028 పోస్టులు - కేంద్రం వెల్లడి!
దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో 6,028 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.
మొత్తం ఖాళీల్లో జనరల్-2154, ఎస్సీ-878, ఎస్టీ-520, ఓబీసీ-1543, ఈడబ్ల్యూఎస్-611, పీడబ్ల్యూడీ కేటగిరీ-322 పోస్టులు ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాజ్యసభలో మార్చి 15న లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఐఐటీల్లో 4,562; ఐఐఎంల్లో 496 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 2018-19లో 10,83,747 ఉన్న విద్యార్థుల సంఖ్య 2021-22 నాటికి 10,22,386కి తగ్గిందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల్లో 12,099, నవోదయ స్కూళ్లలో 3,139, సెంట్రల్ వర్సిటీల్లో 6,028 ఖాళీలు ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది.
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి మార్చి 15న లిఖితపూర్వక సమాధానమిచ్చారు
Comments
Post a Comment