సీఆర్పీఎఫ్లో 9212 కానిస్టేబుల్ పోస్టులు, టెన్త్ అర్హతతో నెలకు రూ.69,100 వరకు జీతం!
పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభంకానుంది.
కేంద్ర హోం మినిస్ట్రీ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (CRPF Job Notification) విడుదల చేసింది.
మొత్తం 9212 కానిస్టేబుల్ ఉద్యోగాలను (CRPF Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 27న ప్రారంభం కానుంది.. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు:
S.No. | మహిళలు/పురుషులు | ఖాళీలు |
1. | పురుషులు: | 9105 |
2. | మహిళలు: | 107 |
మొత్తం: | 9,212 |
మహిళా పోస్టులు: బగ్లర్, కుక్, వాటర్ క్యాషియర్, వాషర్ ఉమెన్, హెయిర్ డ్రస్సర్, సఫాయి కర్మచారి, బ్రాస్ బ్యాండ్.
విద్యార్హతలు:
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు అధికారులు. పోస్టులను అనుసరించి ఏదైనా బోర్డు/యూనివర్సిటీ నుంచి టెన్త్, ఐటీఐ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. హెవీ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఇంకా పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
వేతనం: ఎంపికైన వారికి నెలకు రూ.21700 నుంచి రూ.69100 వరకు వేతనం ఉంటుంది.
CBT (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్): మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో హిందీ/ఇంగ్లిష్ భాష కు 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కు మరో 25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్ నెస్ కు మరో 25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథ్స్ కు 25 మార్కులు ఉంటాయి.
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
అధికారిక వెబ్ సైట్ - https://crpf.gov.in/index.htm
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: మార్చి 27
దరఖాస్తు కోసం చివరి తేదీ: ఏప్రిల్ 25
అడ్మిట్ కార్డ్ జారీ- జూన్ 20-25
CRPF కానిస్టేబుల్ పరీక్ష: జులై 1 నుంచి 13
Age limit yentha
ReplyDeleteAge limit antha
ReplyDelete