Bank Holidays: ఏప్రిల్‌లో 15 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదే..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఏప్రిల్ నెల మొత్తంలో 15 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి.


కొన్ని రాష్ట్రాల వారీగా సెలవులు కూడా ఉండగా నాలుగు ఆదివారాలు రెండవ మరియు నాల్గవ శనివారాలు బ్యాంకులకి సెలవులుగా ఉంటాయి. పండుగ సెలవులు రాష్ట్రానికి బట్టి మారుతూ ఉంటాయి.


ఏప్రిల్ 2023లో బ్యాంక్ సెలవుల జాబితా:


ఏప్రిల్ 2,2023:

ఏప్రిల్ 2వ తేదీన ఆదివారం వస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసే ఉంటాయి.

ఏప్రిల్ 4,2023:

మహవీర్ జయంత్ సందర్భంగా దేశంలోని వివిధ నగరాల్లో ఏప్రిల్ 4న బ్యాంకులు మూసి ఉంటాయి.

ఏప్రిల్ 5, 2023:

బాబు జగ్‌జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.

ఏప్రిల్ 7, 2023:

ఏప్రిల్ 7వ తేదీన గుడ్ ఫ్రైడే ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసే ఉంటాయి. అయితే, అగర్తలా, అహ్మదాబాద్, గువాహటి, జైపూర్, జమ్ము, సిమ్లా, శ్రీనగర్‌లో మాత్రం తెరిచే ఉంటాయి.

ఏప్రిల్ 8, 2023:

ఏప్రిల్ 8న రెండో శనివారం వస్తున్నందున బ్యాంకులు దేశవ్యాప్తంగా మూసి ఉంటాయి.

ఏప్రిల్ 9, 2023:

ఈ రోజున ఆదివారం కాబట్టి బ్యాంకులు మూసి ఉంటాయి.

ఏప్రిల్ 14, 2023:

డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్బంగా దేశవ్యాప్తగా బ్యాంకులు మూత పడనున్నాయి. అయితే ఐజ్వాల్, భోపాల్, డిల్లీ, రాయ్‌పుర్, షిల్లాంగ్, సిమ్లా ప్రాంతాల్లో తెరిచే ఉంటాయి.

 కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                        


ఏప్రిల్ 15, 2023:

ఏప్రిలే 15వ తేదీన వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పండగలు ఉన్నాయి. విషు, బొహాగ్, బిహు, హిమాచల్ డే, బెంగాలీ న్యూ ఇయర్ కారణంగా అగర్తలా, గువాహటి, కొచ్చి, కోల్‌కతా, షిమ్లా, తిరువనంతపురంలలో బ్యాంకులు మూసి ఉంటాయి.

ఏప్రిల్ 16, 2023:

ఏప్రిలే 16న ఆదివారం కాబట్టి బ్యాంకులు మూత పడతాయి.

ఏప్రిల్ 18, 2023:

జమ్ము అండ్ శ్రీనగర్ ప్రాంతాల్లో షాబ్ ఇ కబర్ కారణంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

ఏప్రిల్ 21, 2023:

ఈద్ ఉల్ ఫితర్ కారణంగా ఏప్రిల్ 21న అగర్తలా, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.

ఏప్రిల్ 22, 2023:

ఈ రోజున నాలుగో శనివారంతో పాటు ఈద్ సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.

ఏప్రిల్ 23, 2023:

ఆదివారం సెలవు దినం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసే ఉంటాయి.

ఏప్రిల్ 30, 2023:

ఈ రోజు ఆదివారం సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూత పడనున్నాయి.

ఏప్రిల్ 2023 నెలలో బ్యాంకులు సెలవుల గురించి అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. బ్యాంకు లావాదేవీలు చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు, అవాతరాలు ఏర్పడకుండా చూసుకునేందుకు వీలుంటుంది. ఈ రోజుల్లో బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆన్‌లైన్ సేవలు, ఏటీఎం సేవలు, యూపీఐ వంటివి అందుబాటులో ఉంటాయి



       



Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.