Bharat Electronics Limited: బీఈ/బీటెక్ అర్హతతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు.. నెలక రూ.55 వేల జీతం..
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. 110 ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ కమ్యూనికేషన్/ మెకానికల్/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్/ ఇంజినీరింగ్ బీఎస్సీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు ఫిబ్రవరి 1, 2023వ తేదీనాటికి పోస్టును బట్టి 32 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో మార్చి 17, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఎంపికైవారు విశాఖపట్నం, న్యూఢిల్లీ, ఘజియాబాద్, బెంగళూరులో పనిచేయవల్సి ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
Comments
Post a Comment