జీతాలు పెంచుతూ జీవో జారీ చేసిన ప్రభుత్వం!
శనివారం సాయంత్రం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. జీతాలను భారీగా పెంచుతూ జీవోను జారీ చేసింది. ఈ నిర్ణయంతో.. తెలంగాణ సెర్ఫ్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగాయి.
సెర్ప్ ఉద్యోగులకు జీతాలు భారీగా పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలో ఉన్న 3,978 మంది సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ అమలుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. సెర్ప్ ఉద్యోగుల కనిష్ఠ పే స్కేలు రూ.19 వేల నుంచి రూ.58,850లు కాగా, గరిష్ఠ పే స్కేలు రూ.51,320 నుంచి రూ.1,27,310లుగా నిర్ణయించింది. పెంచిన జీతాలు ఏప్రిల్‌లోనే ఉద్యోగులకు అందనున్నాయి. ఈ వార్తతో సెర్ప్ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. జీతాలా పెంపు డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా.. రాష్ట్రం ఎట్టకేలకు ఇప్పుడు కనికరించింది. అయితే.. ఈ జీతాల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.580 కోట్ల అదనపు భారం పడనుంది.
ఎవరెవరకీ ఎంత జీతం పెరిగిదంటే..
- మండల సమాఖ్య కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లకు రూ.19,000–58,850
- మండల సమాఖ్య కమ్యూనిటీ కో-ఆర్డినేటర్స్(మండల్ రిప్రజెంటెటివ్ పర్సన్స్) – రూ.19,000–రూ. 58,850
- మండల బుక్ కీపర్లకు – రూ.22,240–రూ.67,300
- డ్రైవర్లకు – రూ.22,900–రూ.69,150
- ఆఫీస్ సబార్డినేట్లకు – రూ.19,000–రూ.58,850
- కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లకు – రూ.24,280–రూ.72,850
- అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లకు – రూ.32,810–రూ.96,890
- జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లకు – రూ.42,300–1,15,270
- ప్రాజెక్ట్ మేనేజర్లకు – రూ.51,230–రూ.1,27,310
- అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ప్రాజెక్టు సెక్రటరీస్ – రూ.24,280–రూ.72,850
Comments
Post a Comment