తెలంగాణ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇవే
సెప్టెంబర్ నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.
పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవే..
- పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు
- మున్సిపల్ చట్ట సవరణ బిల్లు
- మోటార్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు
- వ్యవసాయ విశ్వవిద్యాలయ సవరణ బిల్లు
- తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు
- ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ వర్సిటీ అప్‌గ్రేడ్ బిల్లు
- అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు
- పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ బిల్లు
- జీఎస్టీ చట్ట సవరణ బిల్లు
- ప్రయివేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు
10 బిల్లులను గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( CS Shanthi Kumari ) సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌లో ప్రతివాదిగా తమిళిసై సౌందర్ రాజన్ పేరును చేర్చారు. బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు
Comments
Post a Comment