గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు,
గోల్కొండలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(ఏపీఎస్) వివిధ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనిద్వారా అడ్మిన్ సూపర్ వైజర్, ఎల్‌డీసీ, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్, సైన్స్ ల్యాబ్ అసిస్టెంట్, డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, గార్డెనర్, వాచ్ & వార్డు స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మార్చి 20లోపు దరఖాస్తులు సమర్పించాలి.
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీలు: 12
పోస్టులు:
➥ అడ్మిన్ సూపర్ వైజర్: 01
అర్హత: జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ స్థాయి వరకు ఎక్స్-సర్వీస్‌మెన్ ర్యాంక్‌లో ఉండాలి. కంప్యూటర్ తెలిసి ఉండాలి. ప్రభుత్వ, ప్రభుత్వేతర విద్యాసంస్థల్లో
అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
➥ లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ): 01
అర్హత: హవల్దార్ (క్లర్క్) స్థాయి వరకు ఎక్స్-సర్వీస్‌మెన్ ర్యాంక్‌లో ఉండాలి. కంప్యూటర్ తెలిసి ఉండాలి. అకౌంట్స్ విభాగంలో కనీసం 5 సంవత్సరాల
అనుభవం ఉండాలి.
➥ కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్: 01
అర్హత: ఇంటర్‌తోపాటు ఏడాది డిప్లొమా (కంప్యూటర్ సైన్స్) ఉండాలి. కంప్యూటర్ హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి.
➥ సైన్స్ ల్యాబ్ అసిస్టెంట్: 01
అర్హత: ఇంటర్ (సైన్స్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 5 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి.
➥ డ్రైవర్: 01
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.
➥ మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 02
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
➥ గార్డెనర్: 02
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
➥ వాచ్ & వార్డు స్టాఫ్: 03
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. దరఖాస్తుకు విద్యార్హతకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జతచేసి పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Army Public School, Golconda,
Near Ibrahimbagh Post Office,
Sun City, Hyderabad-500031.
దరఖాస్తు చివరి తేది: 20.03.2023.
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
Comments
Post a Comment