రాష్ట్రపతి నిలయాన్ని చూసొద్దామా...! ఏడాదంతా అనుమతి
రాష్ట్రపతి దక్షిణాది విడిదిగా పేరొందిన సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనకు సిద్ధమైంది....
- ఏడాదంతా సందర్శకులకు అనుమతి..
- ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
రాష్ట్రపతి నిలయాన్ని చూసేందుకు వచ్చే వారికి అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆర్ట్ గ్యాలరీ, కోర్ట్్యర్డ్ ప్రాంతాలను నవీకరిం చింది. గతంలో ఏడాదికి 15 రోజులు మాత్రమే సందర్శనకు అనుమతి ఉండగా.. మార్చి 23 నుంచి సోమవారాలు, సెలవు రోజులు మినహా ఏడా దిలో మిగతా అన్ని రోజుల్లోనూ సందర్శించొచ్చు.
బ్రిటీష్ కాలంలో రాష్ట్రపతి నిలయం నిర్మించగా.. అందులో 20కి పైగా గదులుంటాయి. 75 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవనం పచ్చదనంతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. పూలు, పండ్ల తోటలు, ఉద్యానవనాలు, ఫౌంటెన్లు ఇలా ప్రతి ఒక్కటి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ కాలంలో వ్యవసాయానికి ఉపయోగించిన ఊట బావులు, ఎటూ చూసినా పచ్చదనంతో రాష్ట్రపతి నిలయం పరిసరాలు ఆహ్లాదాన్ని పంచుతాయి.
జింకల పార్కు, రాక్ గార్డెన్‌లను నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు. రాష్ట్రపతి నిలయంలో అంతకు ముందు భారీ వృక్షాలు, కొన్ని ఉద్యానవనాలు మాత్రమే ఉండేవి. గత 15 ఏళ్లుగా పచ్చదనానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. భారత తొలి రాష్ట్రపతి బాబూరాజేంద్ర ప్రసాద్ నుంచి ఇక్కడ శీతాకాల విడిది ఆనవాయితీ కొనసాగుతోంది. రాష్ట్రపతి నిలయంలోని 1.20 ఎకరాల్లో 27 నక్షత్రాలు, 9 గ్రహాల పేర్లతో వృత్తాకారంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వనం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.
https://visit.rashtrapatibhavan.gov.in/ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలి.
టిక్కెట్స్ ధర
భార తీయులకు రూ.50,
విదేశీయులకు రూ.250గా ధర నిర్ణయించారు.
సందర్శించు సమయం
ఉదయం10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. తొలిసారిగా బుధవారం రాష్ట్రపతి నిలయంలో ఉగాది వేడుకలను నిర్వహించారు.
Comments
Post a Comment