Narayanapet Jobs 2023: పదో తరగతి అర్హతతో నారాయణపేట జిల్లాలో కొలువులు...

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళా సాధికారత కేంద్రం లో కొలువుల కు నోటిఫికేషన్‌ విడుదల..




తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నారాయణపేట జిల్లా మహిళా సాధికారత కేంద్రం.. ఒప్పంద ప్రాతిపదికన 

డిస్ట్రిక్ట్ మెషిన్ కో-ఆర్డినేటర్, 

జెండర్ స్పెషలిస్ట్, 

ఫైనాన్షియల్‌ లిటరసీ స్పెషలిస్ట్‌, 

అకౌంట్ అసిస్టెంట్, 

మల్టీ పర్పస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి పదో తరగతి, గ్రాడ్యుయేట్‌ సోషల్‌ సైన్స్‌/లైఫ్‌ సైన్స్‌/న్యూట్రిషన్‌/మెడిసిన్‌ హెల్త్‌/సోషల్‌ వర్క్‌/రూరల్‌ మేనేజ్‌మెంట్‌/అకౌంట్స్‌/బ్యాంకింగ్‌లో డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 6, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌లో దరఖాస్తులు సమర్పించవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,600ల నుంచి రూ.38,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌..

జిల్లా సంక్షేమ కార్యాలయం, మోనప్పగుట్ట, నారాయణపేట-509210, తెలంగాణ

పోస్టుల వివరాలు..

  • డిస్ట్రిక్ట్ మెషిన్ కో-ఆర్డినేటర్ పోస్టులు: 1
  • జెండర్ స్పెషలిస్ట్ పోస్టులు: 2
  • ఫైనాన్షియల్‌ లిటరసీ స్పెషలిస్ట్‌ పోస్టులు: 1
  • అకౌంట్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • మల్టీ పర్పస్ స్టాఫ్ పోస్టులు: 1




నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.


             కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                        

       


Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్