TS Govt Jobs: తెలంగాణలో 1540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

 తెలంగాణలో 1540 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ పరిధిలో ఆశా వ‌ర్క‌ర్ల ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.


తెలంగాణలో 1540 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ పరిధిలో ఆశా వ‌ర్క‌ర్ల ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేరకు 1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తిస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థికమంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. 


ఈ ఉత్తర్వులను ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ట్విటర్‌లో షేర్ చేస్తూ సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బలోపేతానికి మరో అడుగు పడినందుకు హర్షం ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,540 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని పేర్కొన్నారు. 

జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం హైద‌రాబాద్, మేడ్చ‌ల్‌, రంగారెడ్డి పరిధిలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీల్లో హైద‌రాబాద్ ప‌రిధిలో 323, మేడ్చ‌ల్‌‌లో 974, రంగారెడ్డి‌ ప‌రిధిలో 243 పోస్టులను భర్తీచేయనుంది. ఈ ఆశా వ‌ర్క‌ర్ల‌ను జిల్లా సెల‌క్ష‌న్ క‌మిటీ  నిబంధనల ప్రకారం జిల్లా నియామక కమిటీల ద్వారా భర్తీ చేస్తారు..


     కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                        

                            

Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.