Whatsapp Group : ఇక వాట్సప్ లో తాత్కాలిక గ్రూప్లు
ప్రత్యేక అవసరాల కోసం వాట్సప్ లో రూపొందించే తాత్కాలిక గ్రూప్ లు ఆ అవసరం తీరాక వాటంతటవే డిలీట్ అయ్యే కొత్త ఫీచర్ను వాట్సప్ తీసుకొస్తోంది.
డిసప్పియరింగ్ మెసేజెస్,
వ్యూవన్స్ ఫీచర్ల తరహాలో ఎక్పైరింగ్ గ్రూప్స్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్తో వినియోగదారులు గ్రూప్ ను రూపొందించుకోవచ్చు.
అడ్మిన్ ఎంపిక చేసిన నిర్ణీత కాల వ్యవధి తర్వాత వాటంతటవే డిలీట్ అయిపోతాయి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ను త్వరలోనే సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఎలా పనిచేస్తుంది?
వాట్సప్ గ్రూప్ రూపొందించిన తర్వాత గ్రూప్ ఇన్ఫో ట్యాబ్లో గ్రూప్ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేస్తే ఎక్స్పైరింగ్ గ్రూప్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై టాప్ చేయగానే రోజు, వారం, కస్టమ్ డేట్, రిమూవ్ ఎక్స్పైరేష 'న్ డేట్ అని నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి.
కస్టమ్ తేదీ ఆప్షన్తో ఏ రోజు వరకు గ్రూప్ లైవ్లో ఉండాలనుకుంటున్నారో ఆ తేదీని ఎంపిక చేయాలి.
గ్రూప్ డిలీట్ అవ్వాల్సిన తేదీ ఎంపిక చేసి.. తర్వాతా కొనసాగించాలనుకుంటే.. రిమూవ్ ఎక్స్పైరేషన్ డేట్పై క్లిక్ చేయాలి. దాంతో గ్రూప్ అడ్మిన్ డిలీట్ చేసే వరకు సదరు గ్రూప్ మనుగడలలో ఉంటుంది.
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
Comments
Post a Comment