Posts

Showing posts from April, 2023

రెగ్యులర్ కానున్న ఉద్యోగాల జాబితా ఇదే .. 40 విభాగాల్లోని 5,544

Image
తెలంగాణ నూతన సెక్రటేరియట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా కాంటాక్టు ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది.  కాంటాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్‌కు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేశారు. ఫైల్‌పై సంతకం చేయడంతో 40 విభాగాల్లోని 5,544 మంది రెగ్యులరైజ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు. ఎంతోకాలంగా రెగ్యులరైజ్‌ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల ఎట్టకేలకు తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సాకారమైంది. సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై కాంటాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం నిర్ణయంతో  2,909 జూనియర్‌ లెక్చరర్ల క్రమబద్దీకరణ,  184 మంది జూనియర్‌ లెక్చరర్లు (వొకేషనల్‌),  390 మంది పాలిటెక్నికల్‌,  270 మంది డిగ్రీ లెక్చరర్లు,  సాంకేతిక విద్యాశాఖలో 131 మంది అటెండర్లు,  వైద్యారోగ్యశాఖలో 837 మంది వైద్య సహాకులు,  వైద్యశాఖలో 179 ల్యాబ్‌ టెక్నీషియన్‌,  158 మం...

కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం KCR శుభవార్త.. క్రమ‌బ‌ద్దీక‌ర‌ణ‌పై సీఎం కేసీఆర్ తొలి సంత‌కం

Image
  నూతన సచివాలయ ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్​ తన ఛాంబర్​లో ఆరు ఫైళ్లలో సంతకాలు చేశారు,  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స‌చివాల‌యం ఆరో అంత‌స్తులోని త‌న ఛాంబ‌ర్‌లో సీఎం కేసీఆర్ (CM KCR) ఆసీనుల‌య్యారు.  ఈ సంద‌ర్భంగా కీల‌క ద‌స్త్రంపై కేసీఆర్ సంత‌కం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమ‌బ‌ద్దీక‌ర‌ణ‌పై కేసీఆర్ మొద‌టి సంత‌కం చేసి, ఆ ఉద్యోగుల్లో సంతోషం నింపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృత‌జ్ఞత‌లు అంటూ హ‌రీశ్‌రావు ట్వీట్ చేశారు. Join WhatsApp Group Click Here  Join Telegram Group Click Here

SBIలో ఉద్యోగాలు.. రెగ్యూలర్, కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం...

Image
  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది.  పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హత గల అభ్యర్థులు SBI అధికారిక సైట్  sbi.co.in  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఖాళీ వివరాలు రెగ్యులర్ పోస్ట్‌లు :  182 పోస్ట్‌లు కాంట్రాక్టు పోస్టులు :  35 పోస్టులు SI నం పోస్ట్ పేరు  మొత్తం 1. నిర్వాహకుడు 02 2. ఉప నిర్వహణాధికారి 44 3. అసిస్టెంట్ మేనేజర్ 136 4. అసిస్టెంట్ VP 19 5. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ 01 6. సీనియర్ కార్యనిర్వాహకుడు 15 అర్హత:   పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి:   31.03.2023 నాటికి పోస్టుని అనుసరించి 31-42 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు:   రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంది. దరఖాస్తు విధానం :   ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం :   రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేష...

తెలంగాణలో కొలువుల జాతర.. 4006 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Image
 టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ ( https://treirb.telangana.gov.in/ ) అదిరిపోయే శుభవార్త చెప్పింది.  మరో భారీ నోటిఫికేషన్ ను  తాజాగా విడుదల చేసింది. మొత్తం 4006 టీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ను కొద్ది సేపటి క్రితం బోర్డు విడుదల చేసింది.ఇందుకు సంబంధిచిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 28వ తేదీ.. అంటే రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మే 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 4006 ఖాళీలకు గాను.. విద్యార్హతలు : వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. వయస్సు జులై 1 నాటికి 18-44  ఏళ్లు ఉండాలి. వివిధ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. వేతనం : ఎంపికైన వారికి స్కేల్ ఆఫ్ పే రూ.42,300 - రూ.1,15,270 ఉంటుందని నోటిఫికేషన్ల...

శ్రీహరికోటలోని 94 టెక్నీషియన్ పోస్టులు

Image
 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో.. 94 టెక్నీషియన్, టెక్నీషియన్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.    పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ/ ఎన్‌టీసీ/ ఎన్‌ఏసీ, డిప్లొమా, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియాలో రిజిస్ట్రర్‌ అయ్యి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ముఖ్య సమాచారం: విభాగాలు:  కెమికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ప్లంబర్, ఆపరేటర్ కమ్ మెకానిక్, హెచ్‌వీడీ లైసెన్స్‌డ్‌ డీజిల్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్, సివిల్, మెకానికల్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ఖాళీల వివరాలు.. టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టులు: 12 లైబ్రరీ అసిస్టెంట్-ఎ పోస్టులు: 2 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు: 6 టెక్నీషియన్-బి/ డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి పోస్టులు: 74 అర్హత :  పోస్టులను అనుసరించి పదో త...

30 వేల జీతం తో హైదరాబాద్ లో జాబ్స్ | వెంటనే అప్లై చేయండి

Image
  డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి అఫ్ తెలంగాణ (DEET) లో ప‌లు ప్రైవేట్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది 1. కంపెనీ: డెలివరీ లిమిటెడ్‌ వృత్తి: ఫీల్డ్‌ జాబ్‌ ప్రోత్సాహకం: కొత్త ఇ-బైక్‌ జీతం – నెలకు 25 నుంచి 30 వేలు అడ్రస్‌:1-8-7/12, Sarvodaya Colony, Chikadpally, Hyderabad – 500020 మెయిల్‌: narumanchi.srilekha1@delhivery.com 2.కంపెనీ: కాల్‌ ఫర్‌ జాబ్స్‌ వృత్తి: ఆఫీస్‌ (లేదా) ఫీల్డ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ అర్హతలు: ఇంటర్‌, డిగ్రీ నైపుణ్యం: వాక్చాతుర్యం, సేల్స్‌ కెరీర్‌లో రాణించే నేర్పు స్థలం: హైదరాబాద్‌ అనుభవం: 0 నుంచి 3 సంవత్సరాలు ఖాళీలు: 30 ఫోన్‌: 8317686942 / 8977900955 Join WhatsApp Group Click Here  Join Telegram Group Click Here

తెలంగాణ జ్యుడీషియల్‌ సర్వీసు పోస్టులు- అర్హతలివే!

Image
  తెలంగాణ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీసులో డిస్ట్రిక్ట్‌ జడ్జి(ఎంట్రీ లెవెల్‌) పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ హైకోర్టు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది వివరాలు.. * డిస్ట్రిక్ట్‌ జడ్జి(ఎంట్రీ లెవెల్‌) పోస్టులు మొత్తం ఖాళీలు: 11 అర్హత:   తెలంగాణ హైకోర్టు లేదా దాని పరిధిలోని న్యాయస్థానాల్లో అడ్వకేట్‌గా కనీసం ఏడేళ్ల పని అనుభవంతో పాటు ఇతర విద్యార్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి:  35 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు:   రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. దరఖాస్తు విధానం:   ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ:   స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. జీత భత్యాలు:   నెలకు రూ.1,44,840 – రూ.1,94,660. ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:  01.05.2023. ఎంపిక పరీక్ష తేదీలు:   24.06.2023(శనివారం), 25.06.2023(ఆదివారం). ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానం  : దరఖాస్తుల‌ను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన, బూరుగుల రామకృష్ణారావు భవన్, 9వ అంతస్తు, ఆదర్శ్ నగర్, హైదరాబాద్- 500053 అ...

కొత్త జిల్లాల వాహన రిజిస్ట్రేషన్ నంబర్స్ మీకు తెలుసా ?

Image
 తెలంగాణ రాష్ట్ర జిల్లాల వారీగా వాహన నమోదు సంఖ్య జాబితా కార్పొరేషన్ వెహికల్ నంబర్ ప్లేట్ లిస్ట్, తెలంగాణ వెహికల్ నంబర్ ప్లేట్ లిస్ట్, తెలంగాణ ఆర్టీఏ జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ కోడ్‌లు - 31 జిల్లాలు, ts rta కొత్త రిజిస్ట్రేషన్ కోడ్‌లు.. Adilabad district TS-01 Mancherial district TS-19 Karimnagar district TS-02 Kumaram Bheem Asifabad district TS-20 Warangal Urban district TS-03 Jagtial district TS-21 Khammam district TS-04 Peddapalli district TS-22 Nalgonda district TS-05 Sircilla district TS-23 Mahbubnagar district TS-06 Warangal (rural) district TS-24 Ranga Reddy TS-07 Jayashankar Bhupalpally district TS-25 Medchal-Malkajgiri District TS-08 Mahabubabad district TS-26 Hyderabad Central TS-09 Jangaon district TS-27 Hyderabad North TS-10 Bhadradri Kothagudem district TS-28 Hyderabad East TS-11 Suryapet district TS-29 Hyderabad South TS-12 Yadadri Bhuvanagiri district TS-30 Hyderabad West TS-13 Nagarkurnool district TS-31 Reserved for Hyderabad TS-14 Wanaparthy district TS-32 Sangar...

డిగ్రీతో హైదరాబాద్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

Image
 హైదరాబాద్ నగరంలోని ఇన్స్యూరెన్స్ రెగ్యూలేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI) పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 45 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆక్యురియల్, ఫైనాన్స్, లా, ఐటీ, రీసెర్చ్, జనరలిస్ట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫకేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్‌/బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో మే 10, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా రూ.750లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌ పరీక్ష, డిస్క్రిప్టివ్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.45,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. మొత్తం 160 మార్కులకుగాను 160 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 90 నిమిషాల వ్యవధి...