తెలంగాణలో కొలువుల జాతర.. 4006 ఉద్యోగాలకు నోటిఫికేషన్
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (https://treirb.telangana.gov.in/) అదిరిపోయే శుభవార్త చెప్పింది.
మరో భారీ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది. మొత్తం 4006 టీజీటీ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ను కొద్ది సేపటి క్రితం బోర్డు విడుదల చేసింది.ఇందుకు సంబంధిచిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 28వ తేదీ.. అంటే రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మే 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ రోజు సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
మొత్తం 4006 ఖాళీలకు గాను..
విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. వయస్సు జులై 1 నాటికి 18-44 ఏళ్లు ఉండాలి. వివిధ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
వేతనం: ఎంపికైన వారికి స్కేల్ ఆఫ్ పే రూ.42,300 - రూ.1,15,270 ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
దరఖాస్తు విధానం ఇలా..
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://treirb.telangana.gov.in/index.php ను ఓపెన్ చేయాలి.
Step 2: హోం పేజీలో Apply Online/ One Time Registration (OTR) అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో New Registration (OTR)? అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
Step 4: ఫస్ట్ మీ ఆధార్ వివరాలను నమోదు చేయాలి.
Step 5: తర్వాత సూచించిన ఇతర వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
Step 6: తర్వాత హోం పేజీలో కనిపించే Apply Online ఆప్షన్ పై క్లిక్ చేసి ఓటీఆర్ నంబర్ తో లాగిన్ అవ్వాలి.
Step 7: అక్కడ మీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.. చివరగా భవిష్యత్ అవసరాల కొరకు మీ అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి..
Comments
Post a Comment