తెలంగాణ పోలీసుల భారీ జాబ్ మేళా.. వివిధ సంస్థల్లో 4000 జాబ్స్.. వివరాలివే
తెలంగాణ పోలీసులు భారీ జాబ్ మేళాను ప్రకటించారు. ఈ జాబ్ మేళా ద్వారా 100కు పైగా ప్రముఖ కంపెనీల్లో 4 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ కేవలం శాంతి భద్రతల పరిరక్షణకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజా సేవలోనూ ముందు వరుసలో ఉంటున్నారు. వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తమ ప్రత్యేకతను చాటుతున్నారు. ఇందులో భాగంగా నిరుద్యోగ యువత కోసం ఫ్రీగా ఉద్యోగ శిక్షణలు, జాబ్ మేళాలను సైతం నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా కరీంనగర్ పోలీసులు (Karimnagar Police) మరో భారీ జాబ్ మేళాను ప్రకటించారు. ఈ నెల 11వ తేదీన కరీంనగర్ లో భారీ జాబ్ మేళా (Job Mela) నిర్వహించున్నట్లు తెలిపారు. కరీంనగర్ లోని గీతాభవన్ చౌరస్తా సమీపంలోని పద్మనాయక కళ్యాణమండపం ఆవరణలో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్హత కలిగిన దాదాపు 4 వేల మందికి ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన వివరించారు..
ఏ ఏ కంపెనీలు జాబ్ మేళలో....
ఈ జాబ్ మేళాలో ప్రముఖ విప్రో, జెన్ ప్యాక్, టాటా సర్వీసెస్, HDFC బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఐసీఐసీఐ, ఇండిగో ఎయిర్ లైన్స్, గూగుల్ పే, రిలయన్స్ జియోతో పాటు దాదాపు 100 పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయి.
జాబ్ మేళాలో ఆయా కంపెనీ ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూల ద్వారా తమకు కావాల్సిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ జాబ్ మేళాలలో ట్రాన్స్ జెండర్స్ కూడా పాల్గొనవచ్చని కమిషనర్ తెలిపారు..
వారికి కూడా ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు...
కావాల్సిన సర్టిఫికెట్స్ & వివరాలు
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ
- విద్యార్హతల సర్టిఫికెట్లు (జిరాక్స్ కాపీలు)
- రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు
- ఆధార్ కార్డ్
- రెస్యూమ్
హాజరుకావాలని సూచించారు. ఈ జాబ్ మేళా ఈ నెల 11వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుందని వివరించారు..
హెల్ప్ లైన్ కోసం
అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఆర్ఎస్ఐలు
మహేష్ ( 9652169877 ),
తిరుపతి ( 6301955823 ) నంబర్లను సంప్రదించాలని సూచించారు....
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
Thithreya parashuram
ReplyDelete