డిగ్రీ అర్హతతో జాబ్స్.. నెలకు రూ. 50 వేలకు పైగా జీతం..
నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ పడింది. డిగ్రీ పూర్తి చేసిన వారికి మంచి జీతంతో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
డిగ్రీ పాసైన వారికి తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లో జాబ్ నోటిఫికేషన్స్ పడ్డాయి. డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.
పోస్టు వివరాలు:
- పోస్టు: జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్
- మొత్తం పోస్టులు: 100
- వయసు పరిమితి: జనవరి 1 2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ళు ఉండాలి.
- జీతం: నెలకు రూ. 29,255 నుంచి రూ. 54,380 వరకూ
అర్హత:
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ లేదా బీఎస్సీ లేదా బీకామ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- తెలంగాణ ప్రభుత్వం లేదా భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ నుంచి కంప్యూటర్ అప్లికేషన్/ఆఫీస్ ఆటోమేషన్(ఎంఎస్ ఆఫీస్) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- డిగ్రీలో కంప్యూటర్స్ సబ్జెక్ట్ తీసుకున్నవారికి కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికెట్ అవసరం లేదు.
పోస్టులు ఎక్కడంటే?:
- వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష కేంద్రాలు:
- హైదరాబాద్ (జీహెచ్ఎంసీ), వరంగల్ (జీడబ్ల్యూఎంసీ) లోని పలు కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
- పరీక్ష తేదీ: మే 28 2023
- హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవడానికి తేదీ: మే 22 2023
- దరఖాస్తుల సవరణ తేదీ: 02-05-2023 నుంచి 05-05-2023
- దరఖాస్తు చివరి తేదీ: 29-04-2023
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 10-04-2023
- దరఖాస్తు ఫీజు: రూ. 200/-
- పరీక్ష ఫీజు: రూ. 120/-
- ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు/ఎక్స్ సర్వీస్ మెన్ లకు: రూ. 0/-
వివరాలు | లింక్ |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్‌సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
It could better for graduation person s
ReplyDelete