మీ సెల్ ఫోన్ పోయిందా ఇక ఇట్టే పట్టేయవచ్చు
వేలకు వేలు దారపోసి కొన్న స్మార్ట్‌ఫోన్‌ను ఎవరైనా దొంగిలించారంటే ఆ బాధ వర్ణణాతీతం. ఫోన్‌లో విలువైన సమాచారం అగంతకుల చేతికి చేరి దుర్వినియోగం అవుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు కేంద్ర టెలికాం విభాగం సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR)ని అందుబాటులోకి తీసుకొచ్చింది
పోయిన మొబైల్ ను ceir.gov.in పోర్టల్ లోకి వెళ్ళి క్రింద తెలిపిన వివరాలను నమోదు చేస్తూ బ్లాక్ చేయు విధానం
- మొదటిగా www.ceir.gov.in పోర్టల్ లో కి లాగిన్ అవ్వాలి.
- ఇక్కడ CEIR Services ను క్లిక్ చేయాలి.
- తర్వాత Block Stolen/Lost Mobile ని క్లిక్ చేయాలి.
- అప్పుడు వచ్చిన వెబ్ పేజీలో క్రింది వివరాలు నమోదు చేయాలి.
పోయిన మొబైల్ ఫోన్ వివరాలు
IMEI నెంబర్లు, అందులో ఉన్న మొబైల్ నెంబర్లు, మొబైల్ ఫోన్ యొక్క బ్రాండ్, మోడల్ మరియు ఇన్వాయిస్ కాపీ/రశీదు
మొబైల్ పోయినప్పటి సమాచారం:
స్థలం, తేదీ, రాష్ట్రం, జిల్లా, పోలీస్ స్టేషన్ పరిధి, పోలీస్ కంప్లైంట్ నెంబరు మరియు కంప్లైంట్ యొక్క కాపీ పేరు, చిరునామా, గుర్తింపు కార్డు వివరాలు, ఈమెయిల్ మరియు మొబైల్ పోయినప్పుడు అందులో ఉన్న సిమ్ కార్డు స్థానంలో తీసుకున్న అదే నెంబర్కు వచ్చిన OTP ని నమోదు చేయాలి..
పై విధంగా వివరాలు నమోదు చేసిన తరువాత వచ్చే రిఫరెన్స్ ఐడిని నమోదు చేసుకోవాలి. అప్పటి నుండి 24 గం॥ ల తరవాత మీ IMEI బ్లాక్ అవుతుంది..
ఒకవేళ పోగొట్టుకున్న ఫోన్ దొరికితే యాప్ లో అన్‌బ్లాక్ చేయాల్సి ఉంటుంది. అందుకు సీఈఐఆర్ పోర్టల్‌లో అన్‌బ్లాక్ ఆప్షన్ పై క్లిక్ చేసి, యూజర్ ఐడీ ఇతర వివరాలను సమర్పిస్తే ఫోన్ అన్‌బ్లాక్ అవుతుంది
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
Comments
Post a Comment