Mega Job Mela: తెలంగాణలో మెగా జాబ్ మేళా.. 5 వేలకు పైగా జాబ్స్
తెలంగాణలో మెగా జాబ్ మేళా.. 50కి పైగా కంపెనీల్లో.. 5 వేలకు పైగా జాబ్స్..వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి
నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇటీవల వివిధ స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు, రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో భారీగా జాబ్ మేళాలను (Job Mela) నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాల ద్వారా వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తున్నాయి. తాజాగా తెలంగాణ మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఆయన కుమారుడు తూళ్ల వీరేందర్ గౌడ్ భారీ జాబ్ మేళాను ప్రకటించారు. ఈ జాబ్ మేళాను ఏప్రిల్ 23న హైదరాబాద్ నిర్వహించనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు: ఈ జాబ్ మేళాలో మొత్తం 50కి పైగా సంస్థలు పాల్గొననున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంస్థల్లో 5 వేలకు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చేసిన వారు హాజరుకావొచ్చని తెలిపారు. ఇంకా వయో పరిమితి విషయానికి వస్తే.. కనీసం 18 ఏళ్లు ఉండాలన్నారు. ఫ్రెషర్లు, ఎక్స్పీరియన్స్ ఉన్న వారు సైతం అప్లై చేసుకోవచ్చని తెలిపారు.
జాబ్ మేళా నిర్వహించే స్థలం: దేవేంద్ర విద్యాలయ, తుక్కుగూడ, మహేశ్వరం.
రిజిస్ట్రేషన్ లింక్: పైన ఉన్నా QR కోడ్ ని స్కాన్ చేయండి లేదా CLICK HERE
Note: 2016-2023 మధ్య ఉత్తీర్ణులైన వారికి అవకాశం ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర వివరాలకు 737893939 నంబర్ ను సంప్రదించవచ్చు.
Srinath
ReplyDeleteThis tha like it
ReplyDelete